‘ది బిగ్ బాస్’, ‘ఫిస్ట్ ఆఫ్ ఫ్యూరీ’, ‘ఎంటర్ ది డ్రాగన్’ వంటి చిత్రాల ద్వారా నటుడిగా ప్రేక్షకులకు దగ్గరయ్యారు… బ్రూస్ లీ… పరిచయం అక్కర్లేని పేరు. మార్షల్ ఆర్ట్స్‌కు పెట్టింది పేరు. 32 ఏళ్ల వయసులో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. బ్రూస్లీ చనిపోయి 40 ఏళ్లు పైనే అయినప్పటికీ ప్రేక్షకులు మనసుల్లో మిగిలిపోయారు.ఈ మార్షల్ ఆర్ట్స్ కింగ్ జీవితంలో ఎదుర్కొన్న గెలుపు, ఓటములను బాలీవుడ్ దర్శకుడు శేఖర్ కపూర్ సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరించనున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్. రెహమాన్‌ను సంప్రదించగా మ్యూజిక్ డైరెక్టర్‌గా చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ‘‘ఈ సినిమా నాకో పెద్ద సవాల్. ఎందుకంటే శేఖర్ కపూర్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తాడు’’ అంటున్నారు రెహమాన్. బ్రూస్లీ పాత్రకు సూట్ అయ్యే హీరోని ఎంపిక చేసే పనిలో శేఖర్ ఉన్నారు.
రెహ్మాన్ కీర్తి కిరీటంలోకి మరో కలికితురాయి !
ప్రతిష్ఠాత్మక అవార్డులలో నామినేట్ కావడం….
భారత దేశంలోని వివిధ భాషా చిత్రాలకు రెహ్మాన్ అందించే మ్యూజిక్ ఒక ఎత్తు కాగా అంతర్జాతీయ చిత్రాలకు అతను అందించే సంగీతం మరో ఎత్తు. అందుకే అంతర్జాతీయంగా రెహ్మాన్ సంగీతం అంటే పడి చచ్చే వారు ఎందరో ఉన్నారు. ఒకే యేడాది రెండు ఆస్కార్ అవార్డులు అందుకున్న రెహ్మాన్ ‘గ్రామీ’, ‘గోల్డెన్ గ్లోబ్’ వంటి అంతర్జాతీయ అవార్డులనూ సొంతం చేసుకున్నాడు. అయితే ఆ విజయాలను తద్వారా తన కొచ్చిన గుర్తింపును రెహ్మాన్ ఎప్పుడూ తలకు ఎక్కించుకోడన్నది సన్నిహితులు చెప్పే మాట.
విజయాల పట్ల తామరాకు మీద నీటి బొట్టులా వ్యవహరించే రెహ్మాన్ కీర్తి కిరీటంలోకి మరో కలికితురాయి చేరబోతోందని తెలుస్తోంది. తాజాగా రెహ్మాన్ బ్రిటీష్ – ఇండియన్ హిస్టారికల్ ఫిల్మ్ ‘వైస్రాయిస్ హౌస్’ కు స్వరాలు సమకూర్చాడు. ‘వరల్డ్ సౌండ్ ట్రాక్ అవార్డ్స్’ లో ఈ సినిమా నామినేషన్ పొందింది. ఈ విషయాన్ని రెహ్మాన్ స్వయంగా తన ట్విట్టర్ పేజ్ ద్వారా అభిమానులకు తెలియచేశాడు. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులలో తన చిత్రం నామినేట్ కావడం ఆనందంగా ఉందని, ఇది భగవంతుని కృపేనని పేర్కొన్నాడు. మరి రెహ్మాన్ ఈ అవార్డు కూడా దక్కితే అంతర్జాతీయంగా అతనికి మరింత పేరు వస్తుంది.