నేను పడ్డ ఇబ్బందులు ఎప్పుడూ మరిచిపోను !

రణవీర్‌ సింగ్‌… బాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్‌ హీరోగా రాణిస్తున్న వారిలో రణవీర్‌ సింగ్‌ ఒకరు. ట్రెండ్‌కు తగ్గట్టు ఫాలో అవడంలో అతనికి మించిన వారు లేరు. తాజా దీపికా పదుకొనేను వివాహం చేసుకున్న తర్వాత సినిమాలు చేయడం మరింత పెంచాడు. స్టార్‌ కావడానికి ముందు ఈయన కూడా ఇబ్బందులు పడ్డాడట. ఆ విషయాన్ని రణవీర్‌ తాజాగా వెల్లడించాడు…. ”నేను ఎదుర్కొన్న పరిస్థితులే నన్ను ఇలా తయారు చేశాయి. నాకు నేనుగా ఇలా ఉండాలి. అలా ఉండాలని అని అనుకోలేదు. సుమారుగా మూడున్నరేళ్ల పాటు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఈ రోజు నాకు అవకాశాలు వస్తున్నాయి. నాకు ఛాన్స్‌లు ఇస్తున్నవారిని నేను ఎప్పుడూ గౌరవిస్తా. నేను ఎప్పుడూ ఆ విషయాన్ని మరిచిపోను. మిడిల్‌ పాత్‌ను అడాప్ట్‌ చేసుకోవడానికి ప్రయత్నిస్తా. విజయాలు వస్తే సంబరపడిపోను. వైఫల్యాలు వస్తే నిరాశ పడను. విజయం వస్తే ఆనందిస్తా. సినిమా అనేది అనేకమంది కష్టం. అది వైఫల్యం చెందిందంటే ఒక్కరి వల్ల కాదు. అదొక ఉమ్మడి వైఫల్యం” అని చెప్పారు.
మేమిద్దరం మళ్లీ ఎప్పుడు సినిమా చేస్తామో?
‘రామ్‌లీల, భాజీరావ్‌ మస్తానీ’ సినిమాల్లో రణ్‌వీర్‌ సింగ్, దీపికాల కెమిస్ట్రీ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తాజాగా మరోసారి జంటగా స్క్రీన్‌ పంచుకోవాలనుందంటున్నారు ఆమె భర్త రణ్‌వీర్‌. ‘‘దీపికాతో కలసి యాక్ట్‌ చేయడాన్ని ఎంజాయ్‌ చేస్తాను. నటిగా తన సామర్థ్యాన్ని ఇంకా పూర్తి స్థాయిలో ఉపయోగించలేదనుకుంటున్నాను. దీపిక ఎమోషనల్‌గా ఇంకా బాగా నటించగలదు. మేమిద్దరం మళ్లీ ఎప్పుడు సినిమా చేస్తామో? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అని పేర్కొన్నారాయన. రణ్‌వీర్‌ అలా సంకల్పించుకున్నారో లేదో దర్శకుడు కబీర్‌ ఖాన్‌ ‘తథాస్తు’ అన్నారని బాలీవుడ్‌ మీడియా టాక్‌.
 
ప్రస్తుతం1983 క్రికెట్‌ ప్రపంచ కప్‌ ఆధారంగా కబీర్‌ ఖాన్‌ ‘83’ పేరుతో ఓ చిత్రాన్ని రూపొందించనున్న సంగతి తెలిసిందే. ఇందులో కపిల్‌ దేవ్‌ పాత్రను రణ్‌వీర్‌ సింగ్‌ పోషించనున్నారు. కపిల్‌ భార్య రోమీ భాటియా పాత్ర కోసం దీపికను సంప్రదించినట్టు సమాచారం. ఇండియా ఓడిపోతుందని భావించి రోమీ భాటియా స్టేడియంను విడిచి బయటకు వెళ్లిపోవడం, మళ్లీ తిరిగొచ్చే సమయానికి ఇండియా గెలిచే స్టేజ్‌లో ఉండటం వంటి సన్నివేశాలు ఈ చిత్రంలో హైలైట్‌గా ఉండబోతాయట. చిన్న పాత్ర అయినప్పటికీ ఎమోషనల్‌గా ఉంటుంది కాబట్టి దీపిక అయితే బావుంటుందని టీమ్‌ భావించిందట.