విజయ్ దేవరకొండ “అర్జున్ రెడ్డి”… సక్సెస్‌తో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ. వరుస విజయాలతో సూపర్ ఫాంలో ఉన్న ఈ క్రేజీ హీరో బాలీవుడ్ సినిమాలో ఆఫర్‌కు ‘నో’ చెప్పినట్టుగా తెలుస్తోంది. విజయ్ క్రేజ్ దృష్య్టా త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఖాయం అన్న ప్రచారం జరుగుతోంది. అనుకున్నట్టుగానే ఓ బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ కోసం విజయ్ దేవరకొండను సంప్రదించారట.
బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో కపిల్ దేవ్ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ లో అప్పటి జనరేషన్‌కు చెందిన ఓ క్రికెటర్ పాత్రకు విజయ్‌ను సంప్రదించారు. అయితే బాలీవుడ్ లో హీరోగానే ఎంట్రీ ఇచ్చే ఆలోచనలో ఉన్న విజయ్ క్యారెక్టర్ రోల్స్ చేయటం కరెక్ట్ కాదన్న ఆలోచనలో సున్నితంగా తిరస్కరించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ‘డియర్ కామ్రేడ్’ షూటింగ్‌లో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ చేతిలో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి.
సహజంగా ఉండాలంటే రిస్క్ తప్పదు !
కాకినాడ రైల్వే స్టేషన్‌లో జరిగిన ప్రమాదంపై హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. షూటింగ్‌లలో ప్రమాదాలు జరగడం సాధారణమని, నటన సహజంగా ఉండాలంటే రిస్క్ తప్పదని తెలిపారు. కాకినాడ ఇతివృత్తంగా రూపొందిస్తోన్న చిత్రం ‘డియర్ కామ్రెడ్’. అందుకే ఇక్కడ ఎక్కువ పార్ట్ షూట్ చేశామన్నారు. కాకినాడను ఊహించుకునే దర్శకుడు కథ రూపొందించారు. జగన్నాధపురం బ్రిడ్జ్, బీచ్, మార్కెట్‌లను సహజంగా చూపించాలని ఇక్కడే షూటింగ్ చేశామని విజయ్ తెలిపారు.
‘కాకినాడ, అన్నవరం, రాజమండ్రి, ఎంతో ఆహ్లాదంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో సంక్రాంతికి జరిగే కోడి పందాల గురించి విన్నాను. ఎప్పుడు చూడలేదు, అవకాశం ఉంటే ఒకసారి చూసేందుకు ప్రయత్నిస్తాను. పెళ్లి అనేది నాకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడే చేసుకుంటాను. రాజకీయాల కంటే ముందు సినిమాల్లో స్థిరపడాలి’ అని పేర్కొన్నారు.‘గీత గోవిందం’ చిత్రంతో విజయ్‌తో మంచి హిట్ పెయిర్ అనిపించుకున్న రష్మికా మండన్నా ‘డియర్ కామ్రెడ్’లో కథానాయికగా నటిస్తున్నారు. కాకినాడలో షూటింగ్‌లో భాగంగా కదులుతున్న ట్రైన్ ఎక్కబోయి విజయ్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.