మహేష్ బాబు ఈ మధ్య కాలం లో పారితోషికానికి బదులుగా సినిమాలో వాటాలడుగుతున్నాడు… సినిమాల నిర్మాణంలో నిర్మాతకు సపోర్ట్‌గా ఉన్నట్లు ఉంటుంది… భాగస్వామిగా పారితోషికాన్ని మించి లాభాలు సంపాయించే అవకాశం కూడా ఉండటంతో మహేష్ బాబు ఇలా చేస్తున్నాడు. మహేష్ బాబు ఇటీవల ఎఎంబి సినిమాస్ పేరిట మల్టీప్లెక్స్ బిజినెస్ లోనికి ప్రవేశించాడు. తాజాగా ఆయన వెబ్-సిరీస్ వ్యాపారంలోకి కూడా రానున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఓ ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ తో మహేష్ బాబు ఒప్పందం చేసుకున్నట్టు ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. హుస్సేన్ అనే దర్శకుడు ఈ సిరీస్ లను డైరెక్షన్ చేయనున్నాడని సమాచారం. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ వచ్చే సంవత్సరం జనవరి చివర్లో లేదా ఫిబ్రవరి తొలివారంలో ప్రారంభం కావొచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే మహేష్ బాబు ప్రొడక్షన్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే. మహేష్ బాబు వ్యాపార వ్యవహారాలన్నీ అతని భార్య నమ్రత పర్యవేక్షిస్తుంది.