యాక్షన్ హీరో గోపీచంద్, తమిళ్ దర్శకుడు తిరు కాంబినేషన్‌లో.. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న సినిమా ఓపెనింగ్ డిసెంబర్ 22న అనిల్ సుంకర ఆఫీసులో జరిగింది. ఏషియన్ సినిమాస్ సునీల్ ఈ చిత్ర తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టారు. జనవరి 18 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. 2019, మే నెలలో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. స్పై థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. వెట్రి ఫలనిస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నటీనటులు:
గోపీచంద్
సాంకేతిక నిపుణులు:
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: తిరు
నిర్మాత: రామ బ్రహ్మం సుంకర,నిర్మాణ సంస్థ: ఏకే ఎంటర్టైన్మెంట్స్
ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికపాటి, కో ప్రొడ్యూసర్: అజయ్ సుంకర, అభిషేక్ అగర్వాల్
సంగీతం: విశాల్ చంద్రశేఖర్,సినిమాటోగ్రఫీ: వెట్రి ఫళనిస్వామి
రచయిత: అబ్బూరి రవి,ఆర్ట్ డైరెక్టర్: రమణ వంక
కో డైరెక్టర్స్: దాసం సాయి, రాజ్ మోహన్