ఇటీవల కాలంలో ఓ వెరైటీ టైటిల్‌తో ప్రేక్షకులందరిలో క్యూరియాసిటీని పెంచిన చిత్రం ‘శుభలేఖ+లు’. పోస్టర్, టీజర్, థియేట్రికల్ ట్రైలర్ చాలా విభిన్నంగా ఉండటంతో అటు ఆడియన్స్‌లోనూ, ఇటు మార్కెట్‌లోనూ ఓ బజ్‌ను సొంతం చేసుకున్నదీ చిత్రం. పుష్యమి ఫిల్మ్ మేకర్స్ అధినేత బెల్లం రామకృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని చూసి ఫ్యాన్సీ ఆఫర్స్‌ను వరల్డ్ వైడ్ రైట్స్ దక్కించుకుని గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. హనుమ తెలుగు మూవీస్ పతాకం పై రూపుదిద్దుకున్న ఈ చిత్రం డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా బుధవారం రామానాయుడు స్టూడియోలో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను జరుపుకుంది. ఇంకా ‘ఆర్ ఎక్స్ 100’ నిర్మాత అశోక్‌రెడ్డి, ‘పెళ్ళిచూపులు’ నిర్మాత రాజ్‌కందుకూరిగారిని సన్మానించారు .
బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ… మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడకి వచ్చిన అతిధులందరికీ మా శుభలేఖ+లు టీమ్ తరపున కృతజ్ఞతలు. ఈ చిత్రానికి మ్యూజిక్ చాలా బాగా కుదిరింది. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిచే చిత్రమిది. ఈ చిత్రం చూసిన తర్వాత డైరెక్టర్ ఎవరు అని నేను అడిగాను శరత్ గారు చాలా బాగా తీశారు ఈ చిత్రాన్ని. ఆయన ఈ చిత్రం అంత బాగా రావడానికి కారణం ప్రొడ్యూసర్స్ అన్నారు. మీరందరూ ఈ చిత్రాన్ని చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను అన్నారు.
అప్పాజీ ఆర్టిస్ట్ మాట్లాడుతూ… నాది ఈ చిత్రంలో బ్యాలెన్స్‌డ్ పాత్రలో నటించాను. అటు పెద్దతరహాగాను, ఇటు చిన్నవాళ్ళను అర్దం చేసుకునేలా ఉంటుంది నా పాత్ర. ఈ చిత్రం టైటిల్ అలా రావడానికి కారణం ఈ చిత్రంలో చాలా ప్లస్‌లు ఉన్నాయి. ఈ చిత్రానికి పనిచేసిన టెక్నీషియన్లు అందరూ పెద్ద ప్లస్‌లు. మీరందరూ ఈ చిత్రాన్ని చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను అన్నారు.
హీరో శ్రీనివాస్ సాయి మాట్లాడుతూ… ఈ స్టేజ్ మీద ఉన్న పెద్ద పెద్దల సపోర్ట్ మాకు చాలా అవసరం. ఎందుకంటే చిత్రం రిలీజ్ కి ముందు ఎంత టెన్షన్ పడతామో మీ అందరికీ తెలిసిందే. అదే టెన్షన్ ఇప్పుడు మాలోనూ ఉంది. మా డైరెక్టర్‌గారు సినిమాని చాలా బాగా తీశారు. ఆయన చాలా కొత్త కొత్త థాట్స్‌తో మీ ముందుకు వస్తారు. మా ప్రొడ్యూసర్స్ ఎంత మంచి వాళ్ళంటే అంత మంచి వాళ్ళు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. మేమందరం కొత్త వాళ్ళం అయిన మా మీద నమ్మకంతో తీశారు. బెల్లంకొండ రామకృష్ణగారిని చూసిన తర్వాత మాకు ఇంకా కాన్ఫిడెంట్ లెవ్స్ బాగా పెరిగాయి. కెరియర్‌లో ఎవరికైనా అప్ అండ్ డైన్స్ ఉంటాయి. కాని ఎలాగోలా ఈ కెరియర్ కొనసాగాలని కోరుకుంటున్నాను అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ మాట్లాడుతూ… మా ప్రొడ్యూసర్ గురించి ఏం చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు. ఆయన నాకు చాలా మంచి స్నేహితుడు. ఆయన ప్రతి పాట విషయంలో నాకు బాగా డిస్కస్ చేసి నా వెంటే ఉండేవారు. మంచి మాటలు కథ కథనం అందించిన శరత్‌నర్వాడే గారికి నా కృతజ్ఞతలు. సాంగ్స్ అన్ని చాలా బాగా వచ్చాయి. డిసెంబర్ 7న ఓట్ వేసి వచ్చి మా సినిమాని చూడండి అని అన్నారు.
డైరెక్టర్ శరత్ మాట్లాడుతూ… మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడకు వచ్చినందుకు పెద్దలందరికీ మా కృతజ్ఞతలు. ఇది నేను నా జీవితంలో మరచిపోలేని రోజు. నా కోసం మా టెక్నీషియన్స్ అందరూ చాలా బాగా కష్టపడ్డారు. అందరూ సినిమాని ప్రేమించి చేశారు. డిసెంబర్ 7న మీ ముందుకు వస్తుంది తప్పకుండా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. యూత్‌కి, పేరెంట్స్ మధ్య ఉండే గ్యాప్ గురించి తీసుకుని చేశాను. పిల్లలు పెళ్లి అనే విషయానికి వచ్చేసరికి ఎందుకు ఇండివిడ్యూలిటీ కోరుకుంటున్నారు అన్న పాయింట్ మీద ఉంటది. మా ప్రొడ్యూసర్‌గారు ప్రమోషన్స్ చాలా బాగా చేశారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఆలాంటి ప్రొడ్యూసర్స్ దొరకడం నా అదృష్టం. మళ్ళీ సక్సెస్‌మీట్‌లో కలుద్దాం అని అన్నారు.
ప్రొడ్యూసర్ అశోక్‌రెడ్డి మాట్లాడుతూ… నేను చాలా ఆనందంగా ఉన్నాను. పెళ్లిచూపులు సినిమా చూసినప్పుడు ఇంత చిన్న బడ్జెట్ తో కూడా సినిమా తీయొచ్చా అని పించింది.ఆర్ ఎక్స్ 100కి, శుభలేఖ+లు కొన్ని సిమిలారిటీస్ కనబడుతున్నాయి. సినిమాలు తీయ్యడం ఒక ఎత్తు అయితే వాటిని రిలీజ్ చెయ్యడం మరో ఎత్తు. ఈ చిత్రంలో పనిచేసిన వారందరికీ ఆల్ ద బెస్ట్. 100పర్సెంట్ మళ్ళీ ఇక్కడే సక్సెస్‌మీట్‌ను జరుపుకుంటారు అని అన్నారు.
ప్రొడ్యూసర్ రాజ్‌కందుకూరి మాట్లాడుతూ… మమ్మల్ని అభినందించి సన్మానించినందుకు ముందుగా కృతజ్ఞతలు. చిన్న సినిమాలను ఎంకరేజ్ చెయ్యాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో మ్యూజిక్ చాలా బావుంది. డైరెక్టర్ కూడా చాలా బాగా తీశారు. మంచి ప్రొడ్యూసర్స్ దొరికారు. నిర్మాతలందరినీ కూడా నేను మెచ్చుకుంటున్నాను అని అన్నారు.
దాసరి కిరణ్‌కుమార్ మాట్లాడుతూ… నాకిది ప్రీరిలీజ్ ఫంక్షన్‌లా లేదు సక్సెస్‌మీట్ లాగా ఉంది. ఇంత మంచి సినిమాను ఎలా తీశాను అని అనుకుంటున్నాము. డిస్ట్రిబ్యూటర్ బెల్లం రామకృష్ణారెడ్డిగారు ప్రమోషన్స్ చాలా బాగా చేశారు. ఎలక్షన్స్ గొడవలో కూడా ఇంత బాగా ప్రమోషన్స్ చేశారు. అందరూ మా ఇన్సిరేషన్స్ ప్రొడ్యూసర్స్ అన్నారు అది చాలా గ్రేట్. ఈ చిత్రంలో నటించిన నటీనటులందరూ బాగా కష్టపడి చేశారు. అందరూ సినిమా చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో దాసరి కిరణ్‌కుమార్, అశోక్‌రెడ్డి, రాజ్‌కందుకూరి, బెల్లంకృష్ణారెడ్డి, ప్రియవడ్లమాని, దీక్షశర్మరైనా, ఇర్ఫాన్, సింధు, తిరువీర్, వంశీరాజ్, మోనాబేద్రె, అప్పాజి అంబరీష తదితరులు పాల్గొన్నారు.