‘గురజాడ సాహితీ పురస్కారం’ అందుకున్న క్రిష్‌

సినీ దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ(క్రిష్)ను విజయనగరంలో గురజాడ సాహితీ సమాఖ్య ‘గురజాడ సాహితీ పురస్కారం(2018)’తో సత్కరించింది. బంగారు ఉంగరం, వస్త్రాలతో పాటు, జ్ఞాపిక అందజేసింది. ఏటా గురజాడ అప్పారావు వర్ధంతిని పురస్కరించుకుని ప్రముఖులకు ఈ పురస్కారం అందజేస్తోంది. విజయనగరం ఆనంద గజపతి కళాక్షేత్రంలో నవంబర్౩౦ శుక్రవారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో విజయనగరం ఎంపీ అశోక్‌గజపతిరాజు, రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ తదితరులు క్రిష్‌కు పురస్కారాన్ని అందజేసి అభినందించారు.
 
యార్లగడ్డ మాట్లాడుతూ… గురజాడ నివసించిన ఇంటి అభివృద్ధి విషయమై కేంద్ర సాంస్కృతికశాఖ దృష్టికి తీసుకువెళ్లాలని ఎంపీ అశోక్‌ గజపతిరాజును కోరారు.
 
గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ… కన్యాశుల్కం, పుత్తడిబొమ్మ పూర్ణమ్మ రచనలతో గురజాడ సమాజాన్ని జాగృతం చేశారని పేర్కొన్నారు.
 
గురజాడ రచన గొప్పదనాన్ని మాటల రచయిత బుర్రా సాయిమాధవ్‌ వివరించారు.
 
క్రిష్‌ మాట్లాడుతూ… ఈ పురస్కారం రావడం ఆనందంగా ఉందన్నారు. కాగా, ఎన్టీఆర్‌ బయోపిక్‌ చిత్రం ఆడియో త్వరలో విడుదల కానుందని క్రిష్‌ చెప్పారు.