రజనీకాంత్… రాజకీయ రంగ ప్రవేశానికి ఉపయోగపడే విధంగా మరో క్రేజీ కాంబినేషన్ రాబోతుంది. రజనీకాంత్, మురుగదాస్ కాంబినేషన్లో త్వరలోనే ఓ సినిమా రూపొందనుందట. దీనికోసమై ఇప్పటికే సన్నాహాలు ఆరంభమైనట్టు తెలుస్తోంది. పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా ఉంటుందట. రజనీకాంత్ రాజకీయాల్లోకి వెళ్లేందుకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో తన రాజకీయ రంగ ప్రవేశానికి ఉపయోగపడే విధంగా ఈ సినిమా ఉంటుందని అందరూ భావిస్తున్నారు. దీనికి సంబంధించి జరిగిన చర్చల తర్వాత ఈ చిత్రంలో నటించేందుకు రజనీ గ్రీన్ సిగల్ ఇచ్చేశారట. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించబోయే ఈచిత్రం రాబోయే సంక్రాంతికి ప్రారంభం కానుందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. రజనీకాంత్, మురుగదాస్ వంటి క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న తొలి చిత్రం కావడంతో కోలీవుడ్లోనే కాదు, దక్షిణాదిలోనే ఇదొక క్రేజీ ప్రాజెక్ట్ అవుతుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
మురుగదాస్ చిత్రాల్లో వాణిజ్య హంగులతోపాటు సామాజిక అంశాలు కచ్చితంగా ఉంటాయి. ఇందులోనూ ఆయన మార్క్ సామాజిక అంశాలు, సందేశం ఉంటుందట. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన ‘పేట్టా’ చిత్రంలో ఆయన నటిస్తున్నారు. ఇది సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. అనంతరం మురుగదాస్ చిత్రం ప్రారంభం కానుంది. మురుగదాస్ ఇటీవల విజయ్ హీరోగా చేసిన ‘సర్కార్’ వసూళ్ళలో సంచలనం సృష్టించింది.