‘మెగాస్టార్ ‘చిరంజీవి ,అల్లు అర్జున్… టాలీవుడ్లో మల్టీస్టారర్స్ ఊపందుకున్నాయి. రాజమౌళి మల్టీస్టారర్ ‘ట్రిపుల్ ఆర్’తో పాటు.. వెంకీ-వరుణ్ ‘ఎఫ్-2’, వెంకీ-నాగ చైతన్య మల్టీస్టారర్స్ సెట్స్‌పై ఉన్నాయి. ఇప్పుడు మెగా ఫ్యామిలీలో రెండు తరాల హీరోలతో మరో క్రేజీ మల్టీస్టారర్‌కు సన్నాహాలు జరుగుతున్నాయట.
‘ఎవడు’లో మెగా హీరోలు.. రామ్ చరణ్-అల్లు అర్జున్ను నటింపజేసి.. సక్సెస్ సాధించిన వంశీ పైడిపల్లి ఈసారి చిరు-బన్నీ కాంబినేషన్లో ఫుల్ఫ్లెడ్జ్ మల్టీస్టారర్‌తో అలరించడానికి సిద్ధమవుతున్నాడట. ప్రస్తుతం మహేశ్ ‘మహర్షి’తో బిజీగా ఉన్న వంశీ.. త్వరలో ఈ మల్టీస్టారర్ కథను చిరంజీవి-బన్నీకి చెప్పబోతున్నట్టు టాక్. వరుసగా వంశీ పైడిపల్లి సినిమాలను నిర్మిస్తున్న దిల్ రాజు ఈ మెగా మల్టీస్టారర్‌ను నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది.
అరడజనుకు పైగా హీరోలున్న మెగా ఫ్యామిలీలో ఒకరి సినిమాలో మరొకరు అతిథులుగా కనిపించడం తప్ప.. ఏ ఇద్దరు హీరోలు కలిసి ఫుల్ లెన్త్ రోల్స్‌లో మల్టీస్టారర్స్‌లో నటించిన దాఖలాలు లేవు. చిరంజీవి చిత్రాల్లో పవన్, అల్లు అర్జున్, రామ్ చరణ్ అతిథులుగా మాత్రమే అలరించారు. ఈ తరుణంలో చిరంజీవి-బన్నీ మల్టీస్టారర్ అంటే మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్‌కు పండగే పండగ. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ న్యూస్ మెగాభిమానులను ఆనందంలో పరవశింపచేస్తోంది. చిరంజీవి ‘విజేత’, ‘డాడీ’లో అల్లు అర్జున్ బాల నటుడిగా నటించారు.