తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తనయుడు కార్తికేయ నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు. ఆయన “షోయింగ్ బిజినెస్” అనే పేరు తో నిర్మాణ సంస్థ స్థాపించారు. తొలిసారి కార్తికేయ నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం `ఆకాశవాణి`. రాజమౌళి వద్ద దర్శకత్వ శాఖలో పని చేసిన అశ్విన్ గంగరాజు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి తనయుడు, సింగర్ కాలభైరవ ఈ చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తుండగా, సురేశ్ రగుతు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జాతీయ అవార్డ్ గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఈ చిత్రానికి ఎడిటర్. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీగా పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కబోయే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జనవరి నుండి ప్రారంభం అవుతుంది. త్వరలోనే మిగతా నటీనటుల వివరాలను ప్రకటిస్తారు.
ఈ చిత్రానికి సౌండ్ డిజైన్: రఘునాథ్.కె, కాస్ట్యూమ్స్: సంజనా శ్రీనివాస్, కాస్టింగ్ డైరెక్టర్: మహతి బిక్షు, ప్రొడక్షన్ డిజైనర్: మోహన్ నాథ్ ఎస్.బింగి, లైన్ ప్రొడ్యూసర్: శశాంక్, స్క్రీన్ ప్లే: అశ్విన్ గంగరాజు, సందీప్ రాజ్, సాయికుమార్ రెడ్డి, నిర్మాత: ఎస్.ఎస్.కార్తికేయ, దర్శకత్వం: అశ్విన్ గంగరాజు.
SS Karthikeya to produce Aakashavani
Ace director SS Rajamouli’s son SS Karthikeya is venturing into production. He has established a banner “Showing Business”. Titled Aakashavani, the film will mark the debut of Ashwin Gangaraju who has worked as the associate of the Baahubali filmmaker in the past.
The film will also see the debut of singer Kalabhairava, the son of leading music composer MM Keeravani, scoring the tunes.
To have dialogues by Sai Madhav Burra and cinematography by Suresh Ragutu, the film will see National Award winner A. Sreekar Prasad on the editor seat.
The period film which is touted to have a very new concept, has been in pre-production for a while and will go on to the sets in January.
The rest of the cast and crew will be announced soon.