పూజా హెగ్డే… గత రెండు మూడు నెలలుగా చేతిలో సూట్‌కేస్ పెట్టుకునే తిరుగుతున్నాను… అని అంటోంది తెలుగులో అగ్ర నాయిక పూజా హెగ్డే. ఎన్టీఆర్‌తో చేసిన ‘అరవింద సమేత’ మంచి హిట్టయింది. ఇక మహేష్‌గారితోనూ, ప్రభాస్‌గారితోనూ చేస్తున్న సినిమాలు కూడా త్వరలోనే పూర్తవుతాయి. తెలుగులో ఇంకా కొన్ని సినిమాలకు ఓకే చెప్పాల్సి ఉంది.ప్రస్తుతం తెలుగులో చేస్తున్న మూడు సినిమాలలో నావి డిఫరెంట్ క్యారెక్టర్లు. ‘అరవింద సమేత’ ముందు వరకు ఆరు నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల దాకా ‘అరవింద సమేత’ షూటింగ్, ఆ తరువాత ఒంటిగంట నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు మహేష్‌గారి సినిమా, ఆ తరువాత ఎనిమిది నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకూ ప్రభాస్ సినిమా, మధ్యలో బాలీవుడ్ సినిమా పూర్తి చేశాను. గత రెండు మూడు నెలలుగా చేతిలో సూట్‌కేస్ పెట్టుకునే తిరుగుతున్నాను. ఒక్క నిమిషం ఎక్కడా కుదురుగా కూర్చోవడం లేదు. ఈ సినిమాలు పూర్తయిన వెంటనే కొంత కాలం రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను.. అలా అని ఖాళీగా ఇంట్లో కూర్చోవాలంటే కూడా నా వల్లకాదు. చేతినిండా పని ఉంటేనే సంతోషంగా ఉండగలుగుతాను.
బాలీవుడ్‌లో.. కూడా వరుస సినిమాలు చేస్తున్నాను. సాజిద్ నడియాద్ వాలా నిర్మాతగా, సాజిద్‌ఖాన్ దర్శకత్వంలో అక్షయ్‌కుమార్, బాబీ డియోల్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘హౌస్‌ఫుల్ 4’లో ఓ ముఖ్యమైన పాత్ర చేస్తున్నాను. ఈ పాత్ర నాకు మంచి పేరు తీసుకొస్తుంది. మరో మూడు సినిమాలకు ఓకే చెప్పాను. వాటి షూటింగ్‌లు ఇంకా మొదలుకావలసి ఉంది.
ఐటెంసాంగ్స్.. ‘రంగస్థలం’లో ఆపాట చేశానంటే నా కారణాలు నాకున్నాయి. ఇప్పటికీ నన్ను కొందరు ‘జిగేల్‌రాణి’ అంటూ పిలుస్తుంటారు. అంత మంచి పేరు తెచ్చింది ఆ సినిమా. అంత పేరు తీసుకొచ్చే పాటలు వస్తే చేయడానికి నాకెలాంటి అభ్యంతరమూ లేదు. కాకపోతే వచ్చే సంవత్సరం చివరి వరకూ డేట్లు అడ్జస్ట్ చేయడం కష్టం. ఆ తరువాత అవకాశం వస్తే చేస్తాను.
ఫెయిల్యూర్స్.. ఏ ప్రయాణంలో అయినా గెలుపోటములు సహజం. ఈ రెంటినీ సమానంగా తీసుకుంటేనే ముందుకు వెళ్లగలం. కానీ ఈ రెండు విషయాల్ని అందరూ ఒకేలా తీసుకోవాలనే రూలు లేదు. నా విషయానికి వస్తే.. ఏదైనా ఫెయిల్యూర్ వస్తే పదిహేను నిమిషాలు ఏడ్చేస్తాను. దాంతో ఆ సినిమా ఫెయిల్యూర్‌తో వచ్చిన బాధలో సగం తగ్గిపోతుంది. పరాజయాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా ఏదో ఒక విధంగా బాధను పోగొట్టుకోవాలి. మళ్లీ పాజిటివ్ మైండ్‌తో నెక్ట్స్ చాలెంజ్‌కు రెడీ అయిపోవాలి. అప్పుడే కెరీర్‌లో ముందుకు వెళ్ళగలం.