“మరిన్ని ప్రయోగాత్మక చిత్రాలల్లో నటిస్తా” అని అంటోంది అదితిరావు హైదరీ. 2006లో మలయాళ చిత్రం ‘ప్రజాపతి’ ద్వారా కథానాయికగా వెండితెరకు పరిచయం అయ్యారు. ‘శ్రీంగరం’ చిత్రంతో తమిళంలోకి, ‘ఢిల్లీ 6’తో బాలీవుడ్‌లోకి, ‘సమ్మోహనం’ సినిమాతో తెలుగులోకి కథానాయికగా అడుగుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.కెరీర్ ప్రారంభం నుంచి విభిన్నమైన పాత్రలు పోషిస్తూ రాణిస్తోంది అదితి. ఇటీవల కాలంలో ‘పద్మావత్’, ‘చెలియా’, ‘నవాబ్’ వంటి వైవిధ్యమైన చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి తన ప్రత్యేకత చాటుకున్నారు. ప్రస్తుతం కూడా ఆమె తమిళంలో రెండు డిఫరెంట్ చిత్రాల్లో నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. మిస్కిన్ దర్శకత్వంలో రూపొందే ‘సైకో’ చిత్రంతోపాటు.. ధనుష్ నటిస్తున్న మరో బైలింగ్వల్ చిత్రంలో నటించే లక్కీ ఛాన్స్‌ను దక్కించుకున్నారు. దీంతోపాటు ప్రస్తుతం తెలుగులో వరుణ్ తేజ్ సరసన ‘అంతరిక్షం’లో నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్లో విడుదల కానుంది. తన కెరీర్ గురించి అదితి చెబుతూ…”సినిమాలకు బౌండరీలు లేవు. ఎక్కడైనా నటించొచ్చు, ఎలాంటి పాత్రైనా చేయోచ్చు. ‘పద్మావత్’ నుంచి వరుసగా భిన్నమైన సినిమాలు చేస్తున్నా. ఈ క్రమంలో రొమాన్స్, పీరియడ్ డ్రామా, క్రైమ్ థ్రిల్లర్ చిత్రాల్లో నటించా. ఈ సినిమాల విజయాలు అందిస్తున్న ఉత్సాహంతో మరిన్ని ప్రయోగాత్మక చిత్రాలల్లో నటిస్తా”అని తెలిపింది.
ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ వస్తున్నా
భారతీయ సినీ పరిశ్రమలో ‘మీటూ’ ఉద్యమం ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా వీటిపై హీరోయిన్ అదితీరావు హైదరీ స్పందించింది… “చిత్రపరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అన్నది చాలాకాలం నుంచి ఉందని వ్యాఖ్యానించింది. కాంప్రమైజ్ అయి,కోరిక తీరిస్తే 3 సినిమాల్లో ఛాన్స్ ఇస్తామని ..కొందరు తనకు గతంలో ఆఫర్ చేశారని అదితీరావు చెప్పింది. కానీ అలాంటివి వద్దనుకుని తాను వచ్చేశానని వెల్లడించింది. తాను ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ వస్తున్నాననీ, ఇలాంటి విషయాల్లో రాజీ పడబోనని తేల్చిచెప్పింది.
కొత్తవాళ్లు సినిమా పరిశ్రమలో ఎదగడం చాలా కష్టమనీ, అయితే అసాధ్యం మాత్రం కాదని స్పష్టం చేసింది. దానికి తానే ఉదాహరణ అని చెప్పింది. సినీ పరిశ్రమలో ఎదురయ్యే పరిస్థితులను మనం ఎలా ఎదుర్కొంటామన్న విషయంపైనే కెరీర్ ఆధారపడి ఉంటుందని అదితీరావు హైదరీ చెప్పింది. టాలెంట్ ఉంటే అవకాశాలు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయని వెల్లడించింది.