‘మూడ్ ఆఫ్ ద నేషన్’… పేరుతో ‘ఇండియా టు డే’ నిర్వహించిన పోల్‌లో “ఇండియాస్ మోస్ట్ పాపులర్ సూపర్‌స్టార్స్” కేటగిరీలో ఐదవ స్థానాన్ని దక్కించుకున్నాడు ‘బాహుబలి-2′ ప్రభాస్.’బాహుబలి-2’ వచ్చి సంవత్సరం దాటిపోయినా యంగ్ రెబెల్‌స్టార్ ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.ప్రభాస్‌కు దేశవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్‌ను ఇది మరోసారి రుజువు చేసింది.
ప్రతీ యేటా ప్రముఖ మేగజైన్ ‘ఇండియా టు డే’ ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ పేరుతో పలు రంగాల్లోని ప్రముఖులపై పోలింగ్ నిర్వహిస్తోంది. అందులో సెలబ్రిటీలు సాధించిన ఓట్లను బట్టి వారికి ర్యాంకులు కేటాయించారు. ఆ లిస్ట్‌లో బాలీవుడ్ సూపర్స్టార్ల సరసన ప్రభాస్ నిలవడం విశేషం. ఈ పోల్‌లో డిఫరెంట్ కేటగిరీలున్నాయి.ఈకోవలోనే జాతీయ స్థాయిలో సినిమా రంగంలో మోస్ట్ పాపులర్ సూపర్‌స్టార్ ఎవరనే దానిపై ఆన్లైన్ ఓటింగ్ నిర్వహించింది. ఈ పోల్‌లో “ఇండియాస్ మోస్ట్ పాపులర్ సూపర్‌స్టార్స్” కేటగిరీలో ఐదవ స్థానాన్ని దక్కించుకున్నాడు ‘యంగ్ రెబెల్ స్టార్’ ప్రభాస్. ఇక్కడ ప్రభాస్ ఘనత ఏమిటంటే… టాప్-5లో చోటు దక్కించుకున్న ఒకే ఒక సౌత్ ఇండియన్ స్టార్ అతను కావడం విశేషం. గత ఏడాది ఇదే పోల్‌లో ప్రభాస్‌కు 7వ స్థానం దక్కింది. అంటే ఈ సంవత్సరకాలంలో రెండు స్థానాలు పైకి ఎదిగాడన్నమాట మన ‘సాహో’.
“ఇండియాస్ మేల్ సూపర్‌స్టార్స్” కేటగిరీలో 11 శాతం ఓట్లతో అగ్రస్థానంలో నిలిచాడు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్. ఇక ఈ పోల్‌లో రెండవ స్థానాన్ని అక్షయ్ కుమార్ దక్కించుకోగా మూడవ స్థానాన్ని షారుఖ్‌ఖాన్, రణ్‌బీర్‌కపూర్ ఒకే తరహా ఓట్లతో షేర్ చేసుకున్నారు. ఇక ఈ పాపులర్ సూపర్‌స్టార్స్ కేటగిరీలో నాల్గవ స్థానాన్ని బాలీవుడ్ వెటరన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ దక్కించుకున్నాడు.
“ఇండియాస్ ఫీమేల్ పాపులర్ సూపర్ స్టార్” కేటగిరీలో ఆశ్చర్యకరంగా ముగ్గురు బాలీవుడ్ ముద్దుగుమ్మలు మొదటి స్థానాన్ని సంపాదించారు. బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ దీపిక పదుకొనె, ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ తలొక 8 శాతం ఓట్లతో ఈ పోల్‌లో అగ్రస్థానాన్ని పంచుకోవడం విశేషం.