“2.ఓ’ మేకింగ్ వీడియో లీకైంది” అంటూ ప్రఖ్యాత బీబీసీలో ఓ ప్రత్యేక కథనం టెలీకాస్ట్ అయ్యింది….గత ఏడాది విడుదల కావలసిన ఈ చిత్రం పలు కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది. నవంబర్ 29న చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. సినిమాపై భారీ అంచనాలు పెంచిన టీం గతంలో పలు పోస్టర్స్ రిలీజ్ చేసింది. కాని ఇప్పటి వరకు టీజర్ విడుదల చేయలేదు. దీంతో అభిమానులు అసంతృప్తితో ఉన్నారు. అయితే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి లీక్ అవుతున్న క్లిప్ లని చూసి ఫ్యాన్స్ షాకవుతున్నారు.
సినీ ప్రపంచంలో లీక్ లు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.. మూవీలు రిలీజ్ కాకుండానే కొన్ని, ప్రొడక్షన్ దశలో ఉండగానే మరికొన్ని మూవీలో లీక్ లు భారీన పడుతున్నాయి..విజయ్ దేవరకొండ నటించిన ‘గీత గోవిందం’ లీక్ షాక్ నుంచి తేరుకోకముందే… ‘అరవింద సమేత వీర రాఘవ’ కేసు కొలిక్కిరాకముందే… మరో సినిమా ‘ట్యాక్సీవాలా’ …తాజాగా తమిళ పరిశ్రమకు గట్టి ‘లీక్’ షాక్ తగిలింది.. శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ టాప్ హీరో అక్షయ్ కుమార్, హీరోయిన్ అమీ జాక్సన్ తో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ రోబో 2.0 మేకింగ్ వీడియో లీక్ అయింది.. ఈ లీక్ అయిన వీడియోని ఏకంగా బిబిసి ప్రసారం చేసింది. మొత్తం ఎనిమిది నిమిషాలున్న వీడియో ఎలా లీక్ అయిందో అర్ధంకాక చిత్ర యూనిట్ సతమతమవుతున్నది..కాగా “2.ఓ మేకింగ్ వీడియో లీకైంది” అంటూ ప్రఖ్యాత బీబీసీలో ఓ ప్రత్యేక కథనం టెలీకాస్ట్ అయ్యింది. ఇందులో ఫుల్ క్లారిటీతో విజువల్స్ ఆకట్టుకున్నాయి. ఈ మేకింగ్‌లో రజనీ చిట్టీరోబో విన్యాసాల వినోదాన్ని చివరిలో చూపించినా, ఇతరత్రా వీడియో ఆద్యంతం… ఎమీజాక్సన్ రోబో గాళ్ లుక్ ఎలా ఉంటుందో… మేకింగ్ విధానం మొత్తం చూపించారు.అతి త్వరలో టీజర్ విడుదల చేయాలని టీం భావిస్తుండగా, ఇలా క్లిప్స్ లీకవ్వడం యూనిట్ ని ఆందోళనకి గురి చేస్తుంది. రెండు మూడు వారాలలో చిత్రానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఫస్ట్ కాపీ ఇస్తారట. ఆ తర్వాత సెన్సార్ కి వెళతారట.