అల్లు అర్జున్… కొత్త సినిమా ప్రారంభోత్సవం వచ్చే వారమే ఉంటుందని తెలిసింది.అల్లు అర్జున్ సినిమా ‘నా పేరు సూర్య…’ వచ్చి మూడు నెలలు అవుతోంది. ఆతర్వాత బన్నీ ఇప్పటివరకు కొత్త సినిమాను ప్రారంభించలేదు. దీంతో అభిమానులు అతని కొత్త సినిమా ఎప్పుడు మొదలవుతుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చివరికి అల్లు అర్జున్ కొత్త సినిమా ప్రారంభోత్సవం వచ్చే వారమే ఉంటుందని తెలిసింది. ‘మనం’ ఫేమ్ విక్రమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. ముందుగా అనుకున్న స్క్రిప్ట్‌కి కొన్ని మార్పులు చేసి అల్లుఅర్జున్ ఇమేజ్‌కు తగ్గట్టు స్క్రిప్ట్‌ను సిద్ధం చేసారట.
ఇక ఈ సినిమాలో విశేషం ఏమిటంటే ….బన్నీ డ్యూయల్ రోల్ చేయబోతున్నట్టు సమాచారం. అదే నిజమైతే తొలిసారిగా ఈ స్టార్ హీరో డ్యూయల్ రోల్ చేసే చిత్రమిదే అవుతుంది. అంతేకాదు తక్కువ గ్యాప్‌లోనే అల్లుఅర్జున్ నటించబోయే మరో చిత్రాన్ని కూడా ప్రకటించబోతున్నట్టు తెలిసింది. గతంలో ప్రకటించిన లింగుస్వామి సినిమానా లేదా మరో చిత్రమా? అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి నాలుగు నెలల విరామం తర్వాత అల్లుఅర్జున్ సెట్స్‌పైకి అడుగు పెట్టబోతున్నాడు. ఇక టిపికల్ స్క్రీన్‌ప్లేతో నడిపిస్తూనే అభిమానులకు కావాల్సిన అన్ని అంశాలు ఉండేలా దర్శకుడు విక్రమ్ కుమార్ జాగ్రత్తపడ్డారట . చాలా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని అల్లుఅరవింద్ నిర్మిస్తున్నారని తెలుస్తోంది.