‘రెడ్డి డైరీ’ పేరుతో శ్రీరెడ్డి బయోపిక్ ?

శ్రీరెడ్డి… ‘క్యాస్టింగ్ కౌచ్‌’పై పోరాడుతున్న వర్ధమాన నటి శ్రీరెడ్డి మరో సంచలనానికి తెరలేపింది. గత కొంతకాలంగా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో శ్రీరెడ్డి వ్యవహారం ఎంత హాట్ టాపిక్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇటీవల చెన్నై వెళ్లిన ఆమె కోలీవుడ్ కు చెందిన సినీ ప్రముఖులు పలువురిపైన తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడింది. ఇలా కాస్టింగ్‌ కౌచ్‌ ఆరోపణలతో టాలీవుడ్‌, కోలీవుడ్‌ వర్గాల్లో అలజడి రేపిన ఆమె తాజాగా ‘రెడ్డి డైరీ’ పేరుతో ఆమె స్వీయ చరిత్రను తమిళంలో తెరకెక్కిస్తున్నట్టు వెల్లడించింది.

‘చెన్నై ప్రెస్‌క్లబ్‌’లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ… తనను మోసగించిన వారి ఆధారాలు తన వద్ద ఉన్నాయని, సమయం వచ్చినపుడు వాటిని బయటపెడతానని మరోసారి కుండ బద్దలు కొట్టింది. తనను లైంగికంగా వాడుకున్న వారి ఫోటోలు, వీడియోలు తన వద్దే ఉన్నాయని, ‘రెడ్డి డైరీ’ మూవీ ద్వారా వాటిని విడుదల చేయనున్నట్లు పేర్కొంది. తాను నటించబోయే ‘రెడ్డి డైరీ’ చిత్రానికి సహకరిస్తామని ‘నడిగర్ సంఘం’ హామీ ఇచ్చిందన్నారు. శ్రీరెడ్డి జీవితంలో చోటుచేసుకున్న వాస్తవ సంఘటనల ఆధారంగా ‘రెడ్డి డైరీ’ని రూపొందిస్తున్నామని చిత్ర దర్శకుడు అల్లావుద్దీన్‌ చెప్పారు.

హైకోర్టులో శ్రీరెడ్డి  ప్రజా ప్రయోజన వ్యాజ్యం
టాలీవుడ్‌ నటి శ్రీరెడ్డి కాస్టింగ్‌ కౌచ్‌పై దర్శకులు, నిర్మాతలు, అగ్రహీరోలు అని ఏ భేదం లేకుండా ఇండస్ట్రీలో పలువురిపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్‌ కౌచ్‌పై హైకోర్టులో శ్రీరెడ్డి ఇటీవల ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. ఇటీవల సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలపై సీబీఐతో ఎంక్వైరీ చేయించాలని శ్రీరెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం మధ్యాహ్నం ఆ పిటిషన్‌ విచారణకు రానుంది. పిటిషనర్‌ శ్రీరెడ్డి తరఫున సీనియర్‌ అడ్వకేట్‌ కళానిధి వాదనలు వినిపించనున్నారు.
 
టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌ (తమిళ సినీ పరిశ్రమ)కు చెందిన మురగదాస్‌, లారెన్స్‌, విశాల్‌పై కూడా ఆరోపణలు చేశారు. వ్యభిచారం లాంటి వాటిలో అనుకోకుండా తానే పాల్గొన్నట్లు పరోక్షంగా శ్రీరెడ్డే వ్యాఖ్యానించారని, అందుకే కేసులు నమోదు చేసి ఆమెను అరెస్ట్‌ చేయాలని నడిగర్‌ సంఘం పోలీసులను కోరింది. కాగా, హైకోర్టు శ్రీరెడ్డి పిటిషన్‌పై ఎలా స్పందిస్తుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.