గొల్లపూడి మారుతి రావు `కళ్లు నాటకం` ఆధారంగా శివాజీ రాజా హీరోగా 1988 లో నటించిన సినిమా `కళ్లు` ముప్పై ఏళ్ళు పూర్తి చేసుకుంది . ఎం.వి.రఘు ఈ సినిమా కి దర్మకత్వం వహించగా ఇవివి సత్యనారాయాణ ఈ సినిమాకి కో డైరెక్టర్ గా పనిచేశారు. ఈ చిత్రానికి సిరివెన్నెల సీతారామశాస్త్రీ పాటలు రాయడంతో పాటు `తెల్లరిందే` అంటూ పాట కూడా పాడారు. ఈ చిత్రం లో రంగడు అనే క్యారెక్టర్ కి ‘మెగాస్టార్’ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఎంతో మంది కొత్త నటీనటులకు ఈ సినిమా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
ఈ చిత్రం గురించి ఉత్తేజ్ మాట్లాడుతూ… `కళ్లు` సినిమా 30 వసంతాలు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సినిమాలు కొంత మందికి అవార్డ్ లని ఇస్తాయి, కొంత మందికి గుర్తింపు ని ఇస్తాయి, మరికొంత మందికి పేరును తీసుకొస్తాయి కొన్ని చిత్రాలు మాత్రమే గుర్తుండి పోతాయి, గొప్ప రచయిత గొల్లపూడి గారు కథ తీసుకోవడం, అసలు ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ నాకు గుర్తుంది. ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు లేదు. అయినా చాలా అద్భుతంగా తీశారు ఎం.వి.రఘు గారు. భిక్షు గారి ద్వారా ఈ సినిమా కి డైరెక్టర్ గారికి అసిస్టెంట్ కావాలంటే నన్ను వైజాగ్ తీసుకెళ్లారు. అలా నేను ఫస్ట్ టైం సినిమా షూటింగ్ చూడటం. అసలు సినిమానే పరిచయం చేసిన చిత్రం `కళ్లు`. ఈ సినిమాకి నేను పనిచేయడం చాలా ఆనందంగా ఉందన్నారు.
శివాజీ రాజా మాట్లాడుతూ… ` ఇప్పుడు ఈ రోజు జరుగుతున్న షూటింగ్ లు గురించి మాట్లాడటమే , కాని ఎప్పడో 30 ఇయర్స్ బ్యాక్ నేను హీరో గా వర్క్ చేసిన `కళ్లు` సినిమా గురించి మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. 31 ఇయర్ప్ బ్యాక్ నా ఫేవరెట్ డైరెక్టర్ పెద్ద వంశీ గారు నన్ను హీరోని చేస్తానని ‘కనక మహాలక్ష్మీ రికార్డింగ్ డ్యాన్స్’ కి తీసుకున్నారు. ఆ రోజు నా ఆనందానికి అవధులు లేవు. అప్పుడే ‘మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్’ లో కోర్స్ పూర్తి చేసుకున్నా. అప్పుడు కరాటే నేర్చుకొని ఫిట్ గా ఉన్నా. దానికి తోడు పెద్ద డైరెక్టర్ దొరకడం,ఆ సినిమా కోసం ఆయన వెంటే తిరిగేవాడ్ని. సరిగ్గా రెండు రోజుల్లో అవుట్ డోర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది అనగా.. నన్ను తీసేసి నరేష్ ని పెట్టారు. ఆ డిప్రెషన్ లో ఉండగా.. ఇవివి సత్యనారాయణ గారు నేను చెన్నైలో ఉండేవాళ్లం, ఆయన ఎం.వి.రఘు గారు ‘కళ్లు’ అనే సినిమా తీస్తున్నారు. ఆడిషన్స్ కి వెళ్లు అన్నారు. అప్పుడే ఫస్ట్ టైం చేతికి , మెడలో ఉన్నవి తాకట్టు పెట్టుకుని ఫ్లైట్ లో హైదరాబాద్ వెళ్లాను. అదే ఫ్లైట్ లో ఎం.వి రఘు గారు కలిసే వెళ్లాము. ‘కళ్లు’ అంటే నేను గొల్లపూడి మారుతిరావు ‘కళ్లు’ అనుకోలేదు. ‘అవే కళ్లు’ అని కొప్పురి శేషగిరి గారిది అనుకున్నాను. హైదరాబాద్ లో ఇంటర్వ్యూ లో.. నేను 1983 లో ఏదైతే ‘కళ్లు’ నాటకం వేశానో అదే నాటకంలో నేను , రాజేశ్వరి గారు క్లైమాక్స్ చేశాము. విత్ ఇన్ 5 మినిట్స్ లో తెలిసి పోయింది.. సినిమాకి సెలక్ట్ అయ్యాను. చాలా న్యాచురల్ గా ఈ చిత్రాన్ని తీసారు రఘు గారు. ఈ సినిమా నాకు రావడానికి కారణమైన ఇవివి గారికి రుణపడి ఉంటాను. చాలా మంది గొప్పవాళ్లతో వర్క్ చేయడం.. చిరంజీవి గారు వాయిస్ ఓవర్ ఇవ్వడం.. ఎంతో గొప్ప వాళ్లతో ఈ సినిమా లో నటించడం నాకు ఆనందం. మళ్లీ ఈ సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది`అన్నారు.
హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ… కొన్ని ఫిల్మ్స్ లైఫ్ లో గుర్తుండి పోతాయ్, అలాంటిది ఫస్ట్ సినిమానే మంచి విజయం సాధిస్తే ..అది జీవితాంతం ఆర్టిస్ట్ కి గుర్తుండి పోతుంది. నాకు కళ్లు గురించి ఎలా తెలుసంటే.. నేను మధు ఇనిస్టిట్యూట్ లో జాయిన్ అయినప్పుడు ‘ఎవరెవరూ ఆర్టిస్టులయ్యారు’ అని ఎంక్వైయిరి చేస్తే.. శివాజీ రాజా , ఆహుతి ప్రసాద్ , చిన్నా వీరు సినిమాల్లో బాగా బిజిగా ఉన్నారు. ఈ ఇనిస్టిట్యూలో జాయిన్ అయితే నేను బిజి అయిపోతాను అని జాయిన్ అయ్యాను . నేను శివాజీ ఎన్నో సినిమాలు కలిసి చేశాను . హీరో గా చేసి ఇప్పుడు తండ్రి క్యారెక్టర్ లు చేస్తున్నాడు. కళ్లు సినిమా 30 ఇయర్స్ పూర్తి చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.
సురేష్ కొండేటి మాట్లాడుతూ… ఈ సినిమా రిలీజ్ అప్పుడు నేను పాలకొల్లు లో 9వ తరగతి చదువుతున్నాను. శివాజీ రాజా అన్న కళ్లు సినిమాలో ఎలా ఉన్నాడో ఇప్పడు విజయ్ సేమ్ అలానే ఉన్నాడు. కుదిరితే ఈ సినిమాని విజయ్ తో తీయాలని ఉంది` అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏడిద శ్రీరామ్ , అనితా చౌదరి , బెనర్జీ , భిక్షపతి , కళ్లు కిష్టారావు మొదలైన వారు పాల్గొన్నారు.