తెలుగు సినిమా ఇండస్ట్రీలో “బాహుబలి” తర్వాత బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన “రంగస్థలం” లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం మైత్రీ మూవీ మేకర్స్ తమ బ్యానర్ నుంచి వస్తున్న తదుపరి క్రేజీ ప్రొజెక్ట్స్ అయిన “అమర్ అక్బర్ ఆంటోనీ, సవ్యసాచి” చిత్రాల విడుదల తేదీలను ఇవాళ ప్రకటించింది.
సూపర్ హిట్ కాంబినేషన్ అయిన “రవితేజ-శ్రీనువైట్ల” కాంబోలో వస్తున్న నాలుగో సినిమా “అమర్ అక్బర్ ఆంటోనీ”. ఇలియానా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ ప్రస్తుతం అమెరికాలో షూట్ జరుగుతోంది. హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 5న విడుదల చేసేందుకు నిర్ణయించారు మైత్రీ మూవీ మేకర్స్.
“ప్రేమమ్” లాంటి సెన్సిబుల్ లవ్ ఎంటర్ టైనర్ అనంతరం నాగచైతన్య-చందు మొండేటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ “సవ్యసాచి” చిత్రాన్ని నవంబర్ 2న విడుదల చేయనున్నారు. నాగచైతన్య సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మాధవన్, భూమికలు కీలకపాత్రలు పోషిస్తుండడం విశేషం. ఒక పాట మినహా “సవ్యసాచి” షూటింగ్ పూర్తయ్యింది.
“రంగస్థలం” అనంతరం మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ మీద ప్రేక్షకులకు విశేషమైన నమ్మకం ఏర్పడింది. అందుకే నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, మోహన్ చెరుకూరి (CVM)లు తమ సంస్థ నుంచి రాబోతున్న తదుపరి చిత్రాల విషయంలో విశేషమైన జాగ్రత్తలు తీసుకొంటున్నారు. హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ తో ఈ ఏడాది మాత్రమే కాదు ఎప్పటికీ తెలుగు సినిమా ప్రేక్షకులను అలరిస్తామని మాట ఇస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్.
AMAR AKBAR ANTHONY,SAVYASACHI RELEASE DATES
After the monstrous success of Rangasthalam standing as the biggest hit of TFI next only to Baahubali, prestigious banner MYTHRI MOVIE MAKERS hereby announce the release dates of their two most exciting upcoming films, Ravi Teja – Srinu Vytla’s AMAR AKBAR ANTHONY and Naga Chaitanya – Chandoo Mondeti’s SAVYASACHI.
Ravi Teja’s AMAR AKBAR ANTHONY is currently into its last schedule with shooting progressing at brisk pace in the USA. The super hit combo of TFI, AMAR AKBAR ANTHONY will hit the screens on October 5. The out and out Ravi, Vytla mark hilarious entertainer is targeting to set a benchmark for entertainment with gorgeous Ileana as heroine.
Action thriller SAVYASACHI marks the repitition of PREMAM combo. Starring Naga Chaitanya, Nidhi Agarwal in top leads with Madhavan, Bhumika Chawla in crucial roles. This technical grandeur is scheduled for a grand release on November 2nd. Having finished entire talkie part, only one song is pending for SAVYASACHI.
With huge responsibility on their shoulders to keep upto the expectations of the Audience following the huge success of RANGASTHALAM in the beginning of this year, Naveen Yerneni, Ravi Shankar Yalamanchili and Mohan Cherkuri(CVM), the three passionate gentlemen behind MYTHRI MOVIE MAKERS are promising to keep up their word of offering wholesome family entertainers to end the year on a grand note.