సాధారణంగా సినిమా ఫ్లాప్ అయితే పూర్తిగా నష్టపోయేది నిర్మాత, బయ్యర్లు. కానీ అమిర్ పాటించే పద్ధతిలో ఎవ్వరూ నష్టపోరు.వంద కోట్లు పెట్టి సినిమా తీయాలంటే ఆ నిర్మాత వందసార్లు కాదు వెయ్యి సార్లు ఆలోచిస్తాడు. ఎందుకంటే ఆ వందకోట్లు పెట్టి తీసిన చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడితే ఆ నిర్మాత ఇక కనిపించడు. కానీ అమిర్ ఖాన్ చిత్రాలు చాలా వరకూ భారీ బడ్జెట్లో భయం లేకుండా సినిమాలు తీసేలా చేసాడు. బాలీవుడ్లో చిత్ర నిర్మాణంలో పాత సరిహద్దులను చెరిపేశారు అమిర్. తనకు తాను కొత్త విధానాన్ని రూపొందించుకున్నారు. ఎవ్వరూ నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సాధారణంగా సినిమా ముఖ్యంగా నిర్మాతకు నష్టభయం అనేది ఉండదు. వచ్చిన లాభాలను పంచుకుంటారు.ఈ విధానాన్ని మొదటి సారిగా 2001లో భారీ బడ్జెట్తో రూపొందిన ‘లగాన్’ చిత్రంతోనే మొదలు పెట్టారు ఈ హీరో. అమీర్ ఖాన్ దాని గురించి వివరించారు….
” నేను కథను ప్రేమిస్తేనే ఆ సినిమాను చేస్తా. సినిమాకు స్క్రిప్ట్ పునాది. ఈ విధానంలో చిత్ర నిర్మాణంలో పెట్టుబడి పెట్టేవారు కచ్చితంగా నష్టపోరు. నష్టాన్ని మొత్తం నిర్మాతే భరించే ట్రెండ్ ప్రస్తుతం ఇండస్టీలో ఉంది. దానికి నేను వ్యతిరేకిని. వంద కోట్లతో సినిమా తీస్తే విడుదలయ్యే వరకూ పైసా తీసుకోను. సినిమా ఆడుతూ ఉంటే..బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబట్టిగలిగితే …మొదటి వసూళ్లు వాటి ప్రమోషన్లకు, ప్రకటనలకు కేటాయిస్తాం. వంద కోట్లు వసూలు చేస్తే…అందులో 25 శాతం ప్రకటనలు, ప్రమోషన్లకు కేటాయిస్తాం. ఈ విధంగా 25 కోట్లు అయిపోయాక, అనంతరం వచ్చిన కలెక్షన్లలో నిర్మాత పెట్టిన పెట్టుబడిని తీసుకుంటాడు. తర్వాత ప్రతి ఒక్కరి పారితోషికం పొందుతారు . ఆ తర్వాత వచ్చిన లాభాలను పంచుకుంటారు. ఈ విధానం వల్ల నిర్మాత ఎట్టిపరిస్థితుల్లోనూ నష్టపోడు. సినిమా ఆడకపోతే నేను ఎటువంటి పారితోషం తీసుకోను. ఇలా ప్రతిసారీ జరుగుతోంది. ఈ తరహాలో నేను పనిచేస్తా. అందుకు నాతో పనిచేసే నిర్మాతలు కూడా సంతోషంగా ఉంటారు” అని అమిర్ అన్నారు.