కమెడియన్ షకలక శంకర్ హీరోగా అదృష్టం పరీక్షించుకుంటున్న సంగతి తెలిసిందే. శంకర్ నటించిన `శంభో శంకర` ట్రైలర్, పోస్టర్లకు అద్భుత స్పందన వచ్చింది. షకలక శంకర్‌ని హీరోగా, శ్రీధర్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆర్. ఆర్. పిక్చర్స్ సంస్థ, ఎస్.కె. పిక్చర్స్ సమర్పణలో వై. రమణారెడ్డి, సురేష్ కొండేటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూన్ 29న విడుదలవుతుంది. ఈ సందర్భంగా సోమవారం జరిగిన ప్రీరిలీజ్ ఫంక్షన్లో బిగ్ సీడీ, ఆడియో సీడీలను మ్యూజిక్ డైరెక్టర్ సాయికార్తీక్ విడుదల చేయగా.. తొలి సీడీని హీరో శంకర్ అందుకున్నారు. ఈ సందర్భంగా…
డైరెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ “రైటర్ భాను ప్రసాద్‌గారు చాలా మంచి డైలాగ్స్ ఇచ్చారు. సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా కోసం ఏమైనా పరావాలేదని శంకర్ ప్రాణం పెట్టి పనిచేశారు. రమణారెడ్డిగారు , సురేశ్ కొండేటిగారు నిర్మాతలుగా మాకెంతో సహకారాన్ని అందించారు. ఈ నెల 29న సినిమా విడుదలవుతుంది. సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ సాయికార్తీక్ మాట్లాడుతూ – “శ్రీధర్‌గారు సినిమాను చాలా చక్కగా డైరెక్ట్ చేశారు. శంకర్ సినిమా కోసం బాగా కష్టపడ్డారు. తను బాగా డాన్సులు చేస్తాడు కాబట్టే, నేను మంచి మ్యూజిక్ ఇవ్వగలిగాను. ఈ సినిమాను నిర్మించిన రమణారెడ్డిగారికి అభినందనలు. సినిమా మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను“ అన్నారు.
నిర్మాత సురేశ్ కొండేటి మాట్లాడుతూ – “ఈ సినిమాకు ఫస్ట్ టెక్నీషియన్ సాయికార్తీక్‌గారే. ఆయన తర్వాతే మిగిలిన టెక్నీషియన్స్ అందరూ సెట్ అయ్యారు. ఆరు నెలల కష్టానికి ప్రతిఫలమే ఈ సినిమా. శంకర్ హీరో ఏంటి? అని అనుకున్నవాళ్లందరికీ ఈ సినిమా సమాధానం చెబుతుంది. శంకర్‌తో ఎందుకు ఈ సినిమా చేశామో? ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. రమణారెడ్డిగారు సినిమా అవుట్ పుట్ బాగా రావడానికి ఏం కావాలో వాటిని అడగ్గానే కాంప్రమైజ్ కాకుండా ఇచ్చారు. ఆయన వల్లే సినిమా ఇంత బాగా వచ్చింది. నాకు తెలిసి ఇది బ్లాక్‌బస్టర్ మూవీ అవుతుంది. బిజినెస్ కూడా పూర్తయ్యింది. అందరి నమ్మకం ఫలిస్తుందని ఆశిస్తున్నాం“ అన్నారు.
నిర్మాత రమణారెడ్డి మాట్లాడుతూ – “శంకర సినిమా విషయంలో మాకు సపోర్ట్ చేసిన నటీనటులు, సాంకేతిక నిఫుణులు సహా అందరికీ థాంక్స్“ అన్నారు.
శంకర్ మాట్లాడుతూ “డైరెక్టర్ శ్రీధర్, నాకు మధ్య ఎన్నో ఏళ్లుగా మంచి స్నేహం ఉంది. మాకు సినిమాలంటే ఆసక్తిని కలిగేలా చేసింది నిర్మలమ్మ. ఆవిడ వల్లనే సినిమా జీవితం గురించి మేం తెలుసుకున్నాం. ఆవిడ ఆశీర్వాదం ఎప్పటికీ ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ సినిమాను దిల్‌రాజు, శిరీష్, లక్ష్మణ్ దగ్గరికి తీసుకెళ్లాను. వారు చేస్తామన్నారు కానీ.. రెండేళ్ల సమయం అడిగారు. మా బాధను నెల్లూరులోని రమణారెడ్డిగారు అర్థం చేసుకున్నారు. ఆయనే ఈ సినిమా చేశారు. అలాంటి నిర్మాతలుంటే నాలాంటి వారెందరో హీరోలుగా, శ్రీధర్లాంటివాళ్లు దర్శకులుగా ఇండస్ట్రీలోకి వస్తారు. నేను నటుడిగా పది రూపాయలు సంపాదిస్తే.. అందులో ఎనిమిది రూపాయలను కష్టాల్లో ఉన్నవారికే ఇచ్చేస్తాను. ఇక సినిమా చాలా బాగా వచ్చింది. ఈ నెల 29న మా సినిమా రిలీజ్ అవుతుంది. మేమెంత కష్టపడ్డామో అందరికీ అర్థమవుతుంది“ అన్నారు.
షకలక శంకర్, కారుణ్య నాగినీడు, అజయ్ ఘోష్, రవి ప్రకాష్, ప్రభు, ఏడిద శ్రీరామ్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి కెమెరా: రాజశేఖర్, సంగీతం: సాయి కార్తిక్, ఎడిటింగ్: ఛోటా.కె. ప్రసాద్, నిర్మతలు: వై. రమణారెడ్డి, సురేష్ కొండేటి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీధర్. ఎన్.