అందాల తార రాధికా ఆప్టేకు ఇప్పుడు బాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంది. ఈ భామ తరచుగా తన కామెంట్స్‌తో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఏ విషయంపైన అయినా సూటిగా మాట్లాడుతుంది ఈ భామ.వివాదాస్పద నటీమణుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న వారిలో రాధికా ఆప్టే ఒకరని చెప్పొచ్చు. తన వ్యక్తిగత విషయాలను బహిరంగపరచి సంచలనానికి తెరలేపారు. ఇటీవల ఒక దక్షిణాది నటుడు తనను పడకగదికి పిలిచారని ఆరోపణలతో కలకలం సృష్టించింది. ఇక రాధిక తరచూ గ్లామరస్ ఫొటోలను ఇంటర్నెట్లో పోస్ట్ చేస్తూ నెటిజన్లకు చేతినిండా పని చెబుతూ వారి విమర్శలను ఎదుర్కొంటోంది. అయితే హిందీ చిత్రాల్లో విచ్చలవిడిగా తన అందాలను ఆరబోసి నటించడం కూడా విమర్శలకు దారి తీస్తోంది. ఈ విషయంలో ‘నా శరీరం నా ఇష్టం’ అని ఇప్పటివరకూ ఎదురుదాడి చేసిన రాధిక ఇప్పుడు తాను గ్లామరస్‌గా నటించిన మాట నిజమేనని అంగీకరించింది. అందుకు కారణం కూడా చెప్పింది…..
“సినిమా రంగంలో బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వారికి అవకాశాలు సులభంగా లభిస్తాయి. అలా సినీ నేపథ్యం లేని వారు చాలా కష్టపడాల్సిందే. నాకు సినిమారంగంలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేదు. అందుకే నేను చాలా కష్టపడ్డాను. చాలా సమస్యలను ఎదుర్కొన్నాను. ఈ రంగంలో ఎలాంటి చిత్రాల్లో నటించకూడదని భావించానో, డబ్బు కోసం అలాంటి చెత్త చిత్రాల్లో నటించాల్సి వచ్చింది. జీవనాధారం కోసం అలాంటి అడ్డమైన చిత్రాలను నిరాకరించలేకపోయాను. అయితే ఇప్పుడు నేను పేరు, డబ్బు సంపాదించుకున్నాను. అవకాశాలు చాలానే వస్తున్నాయి. ప్రస్తుతం అన్నీ అంగీకరించడం లేదని, నచ్చిన కథ నచ్చితేనే ఓకే చెబుతున్నా”అని చెప్పుకొచ్చారు.
“యూట్యూబ్‌లో సెన్సార్ లేకపోవడం గ్రేట్”
ఇక ‘పార్చెడ్’ వంటి సినిమాల్లో నగ్నంగా నటించి అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది రాధికా ఆప్టే. “క్యారెక్టర్ డిమాండ్ చేసింది కాబట్టి అలా నటించాను… హాలీవుడ్ సినిమాల్లో ఇదంతా సాధారణమే” అని పేర్కొంది ఈ భామ. ఇప్పుడు ఈ బ్యూటీ “యూట్యూబ్ సూపర్” అంటూ కామెంట్ చేసింది. “యూట్యూబ్‌లో సెన్సార్ లేకపోవడం గ్రేట్” అంటోంది. తమ ‘టాలెంట్‌ను హద్దులు లేకుండా చూపించే అవకాశం ఉండడం’ అన్నదే ఆమె చెబుతున్న మాట. “సినిమాల్లో నటించడం, డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌లో నటించడంలో తనకు పెద్దగా తేడా ఏమీ కనిపించడం లేద”ని చెప్పిన రాధికా ఆప్టే …అక్కడ బోలెడంత స్వేచ్ఛ ఉంటుందని పేర్కొంది. రాబోయే రోజుల్లో డిజిటల్ ఫ్లామ్ఫామ్స్కు మరింత ఆదరణ పెరగడం ఖాయమని చెప్పింది ఈ హాట్‌బ్యూటీ