విజయాలే కొలమానం కాబట్టి 2018లో నంబర్‌వన్ స్థానాన్ని సమంత ఆక్రమించుకున్నారనే ప్రచారం మొదలైంది. ఈ బ్యూటీ నటించిన తెలుగు చిత్రం ‘రంగస్థలం’, ద్విభాషా చిత్రం ‘మహానటి’, తమిళ చిత్రం ‘ఇరుంబుతిరై’ చిత్రాలు అనూహ్య విజయాలను సాధించాయి. ఇలా ఒకే ఏడాది వరుసగా విజయాలను అందుకున్న నటి సమంతనే అని చెప్పాలి. అంతే కాదు ‘ఇరుంబుతిరై’ తెలుగులో ‘అభిమన్యుడు’ పేరుతో అనువాదంమై వసూళ్లను సాధిస్తోంది. ఈ విజయంలోనూ సమంత భాగం పంచుకున్నారు. తాజాగా సమంత తమిళంలో మరో 3 చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో విజయ్‌సేతుపతితో ‘సూపర్ డీలక్స్’, శివకార్తికేయన్‌కు జంటగా ‘సీమరాజా’, ద్విభాషా చిత్రం ‘యూ టర్న్’. ఈ మూడు చిత్రాలపైనా మంచి అంచనాలే నెలకొన్నాయి. అదేవిధంగా ఇవి కూడా ఈ ఏడాదే తెరపైకి రావడానికి రెడీ అవుతున్నాయి. వీటి రిజల్ట్ కూడా పాజిటివ్‌గా వస్తే కచ్చితంగా నంబర్‌వన్ స్థానం సమంతదే అవుతుంది. ‘ఇరుంబుతిరై’ చిత్ర సక్సెస్ జోరులో ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు ‘సూపర్ డీలక్స్’ చిత్రానికి డబ్బింగ్ చెబుతున్నారు.
స్పష్టమైన మార్పు కనిపిస్తోంది !
పెళ్ళి తర్వాత సమంత ఎంపిక చేసుకునే కథల విషయంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని
ఆమె ఎంచుకున్న చిత్రాలు చెప్పకనే చెబుతున్నాయి. ఇప్పుడెక్కువగా మహిళా ప్రాధాన్యత కలిగిన చిత్రాలకు, ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే చేసేందుకు అమితాసక్తి చూపుతున్నారు. ‘రంగస్థలం’, ‘మహానటి’ వంటి చిత్రాల్లో ప్రయారిటీ కలిగిన పాత్రల్లో నటించి మెప్పించారు. ఆయా చిత్రాల సక్సెస్‌లో కీలక పాత్ర పోషించారు.
ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ చిత్రమైన ‘యు టర్న్’లో నటిస్తున్న విషయం విదితమే. తాజాగా మరో మహిళా ప్రధాన చిత్రానికి గ్రీన్ సిగల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. నూతన దర్శకుడు గిరిసయ్య దర్శకత్వంలో ఈ సినిమా చేయనున్నారట. ఇది పూర్తి వినోదాత్మకంగా ఉంటుందని సమాచారం. సమంత పాత్ర చుట్టూ కథ తిరుగుతుందని, అన్ని కుదిరితే ఈ సినిమా ఆగస్ట్‌లోనే ప్రారంభం కానుందని తెలుస్తోంది.
గిరిసయ్య గతంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దగ్గర ‘అర్జున్‌రెడ్డి’ చిత్రానికి అసిస్టెంట్‌గా
పనిచేశారు. బైలింగ్వల్ ‘యు టర్న్’తోపాటు ‘సీమరాజా’, ‘సూపర్ డీలక్స్’ చిత్రాల్లో సమంత
భిన్న పాత్రలు పోషిస్తున్నారు.