ఇలియానా….ఈ గోవా బ్యూటీ ఓ టాలీవుడ్ సినిమాకు అంగీకరించినట్టుగా తెలుస్తోంది.టాలీవుడ్లో టాప్ హీరోల సరసన నటించి తరువాత బాలీవుడ్ ఆశలతో తెలుగు సినిమాకు గుడ్ బై చెప్పిన బ్యూటీ ఇలియానా. తెలుగులో మంచి ఫాంలో ఉండగానే హిందీ సినిమాల వైపు అడుగులు వేసిన ఈ బ్యూటీ అక్కడ ఆశించిన స్థాయిలో అవకాశాలు సాధించలేకపోయారు. తరువాత దక్షిణాదిలో రీ ఎంట్రీ ఇచ్చేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు.
ఒకటి రెండు సినిమాల్లో అవకాశాలు వచ్చినా భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయటంతో చేజారిపోయాయి. తాజాగా ఈ గోవా బ్యూటీ ఓ టాలీవుడ్ సినిమాకు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. శ్రీనువైట్ల దర్శకత్వలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో ఇలియానా హీరోయిన్గా నటించనున్నారు. అల్లు అర్జున్ సరసన నటించిన జులాయి తరువాత ఇలియానా చేస్తున్న తెలుగు సినిమా ఇదే.
వస్తున్న వార్తలపై మాత్రం ఫుల్ క్లారిటీ …
గోవా బ్యూటీ ఇలియానాకి బాయ్‌ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్‌తో పెళ్లి అయ్యిందా? లేదా? అనే విషయంపై అఫీషియల్ క్లారిటీ లేదు. ఆండ్రూతో కలిసి ఉన్న ఫొటోలు షేర్ చేస్తుంటారే కానీ, పెళ్లి విషయంపై ఇలియానా కూడా స్పష్టత ఇవ్వడం లేదు. కానీ, ఆమె ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తలపై మాత్రం ఫుల్ క్లారిటీ ఇచ్చారు ఇలియానా.
సౌత్‌లో స్టార్‌గా ఎదిగిన ఈ బ్యూటీ బాలీవుడ్‌లోనూ సక్సెస్ బాటలో ముందుకెళ్తున్నారు. అయితే.. ఆమె గర్భవతి అంటూ ఇటీవల వార్తలు హల్చల్ చేశాయి. ‘‘నేను గర్భవతిని కాదు’’అంటూ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు ఇలియానా. ప్రెగ్నెంట్ విషయంపై క్లారిటీ ఓకే.. మరి పెళ్లి విషయంలో కూడా ఇలియానా ఓ స్పష్టత ఇస్తే బాగుంటుంది కదా! అంటున్నారు సినీ జనాలు