విశ్వనటుడు కమల్‌హాసన్ కాంబినేషన్ మూవీ ‘భారతీయుడు’ ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో తెలిసిందే. అప్పట్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సహా విదేశాల్లోనూ ఈ సినిమా అఖండ విజయం సాధించింది ఆ చిత్రం. ఇప్పటికే ఈ సినిమా రిలీజై రెండు దశాబ్ధాలు అయ్యింది. ఆ క్రమంలోనే భారతీయుడుకి సీక్వెల్ తెరకెక్కిస్తున్నామని శంకర్ తైవాన్‌లో ప్రకటించారు. ఇటీవలి కాలంలో రజని ‘2.0’ చిత్రీకరణలో బిజీగా ఉండడం వల్ల ‘భారతీయుడు -2’ కి సంబంధించిన ఏ అప్డేట్ చెప్పలేదు.
ప్రస్తుతం 2.0 నిర్మాణానంతర పనులు సాగుతున్నాయి కాబట్టి, ఇక భారతీయుడు 2 రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించేందుకు శంకర్ సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఓ ప్రముఖ బాలీవుడ్ స్టార్ ఈ సినిమాలో నటించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే సదరు స్టార్‌తో శంకర్ మంతనాలు సాగిస్తున్నారు. శంకర్‌కి యాక్షన్ హీరో అజయ్ దేవగణ్ తో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా అతడినే ఎంపిక చేసే అవకాశం ఉందని వేరొక వైపు ప్రచారం సాగుతోంది.
‘భారతీయుడు 2’ ప్రీప్రొడక్షన్ స్వింగులో ఉంది. తదుపరి రామోజీ సిటీలో భారీ షెడ్యూల్ తెరకెక్కించనున్నారు. ఇక సినిమా ఆరంభం నుంచే శంకర్ తనదైన శైలిలో ప్రచారం సాగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 2019 జనవరిలో రజనీ 2.0 చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహకాల్లో ఉన్న సంగతి తెలిసిందే.