సూపర్ స్టార్ రజినీ కాంత్ అభిమానులు ఆయన అప్ కమింగ్ సినిమా ‘కాలా’ కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆ తర్వాత అందరి కళ్లూ కార్తీక్ సుబ్బరాయన్, రజినీ కాంబో పైనే ఉన్నాయి. రజినీతో సినిమా చేయాలనే ‘మెర్క్యురీ’ డైరెక్టర్ కల నెరవేరబోతోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి ప్రతి నాయకుడిగా చేయబోతున్నారు. సూపర్ స్టార్‌తో, స్టార్ యాక్టర్, అసాధారణ డైరెక్టర్ చేయబోతున్నారు. ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి.సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ రజినీకాంత్ సినిమా అంటే మార్కెట్లో ఏ రేంజ్లో బిజినెస్ జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
రజినీకాంత్ కొత్త ప్రాజెక్టుకు సంబంధించి ఇంట్రస్టింగ్ న్యూస్ కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతుంది. రజినీకాంత్ ఈ సినిమాకు 65 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే రజినీకాంత్ అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటుడిగా నిలవనున్నాడు. మరికొన్ని రోజులు వెయిట్ చేస్తే రజినీ రెమ్యునరేషన్ పై స్పష్టత వస్తుందేమో చూడాలి. ఈ నెల చివరిలోనో లేదంటే జూన్ మొదటి వారంలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాకు అనిరుథ్ రవిచందర్ సంగీతం అందించనున్నట్టు తెలుస్తోంది.
రజనీకాంత్ రెండు వారాలపాటు అమెరికాలో ఉంటారు. షూటింగ్ కోసం కాదు. మెడికల్ చెకప్ కోసం. మెడికల్ చెకప్ కోసమా? తలైవర్ (నాయకుడు)కి ఏమైంది? అని కంగారుపడకండి. తలైవర్ ఆరోగ్యంగానే ఉన్నారు. ఇది జస్ట్ రెగ్యులర్ మెడికల్ చెకప్పే . రజనీ ప్రతి సంవత్సరం మెడికల్ చెకప్ కోసం అమెరికా వెళ్తారన్న విషయం తెలిసిందే. అలాగే ఈసారి అమెరికా ప్రయాణం అయ్యారు.
రజనీతో పాటు ఆయన పెద్ద కుమార్తె ఐశ్వర్య కూడా వెళ్లారని సమాచారం. మే సెకండ్ వీక్ వరకూ అమెరికాలోనే ఉంటారట రజనీకాంత్. తిరిగి రాగానే తన లేటెస్ట్ గ్యాంగ్‌స్టర్ మూవీ ‘కాలా’ సినిమా ప్రమోషన్లో పాల్గొంటారట. పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని వండర్‌బార్ ఫిల్మ్ పతాకంపై ధనుష్ నిర్మించారు. మామ రజనీ సినిమాను అల్లుడు ధనుష్ నిర్మించడం ఇదే ఫస్ట్ టైమ్. ‘కాలా’ సినిమా ఆడియోను చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా రంజాన్ స్పెషల్‌గా జూన్ 7న రిలీజ్ కానుంది.