సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా కాస్టింగ్ కౌచ్ గురించి ఎన్నో వివాదాలు తెరపైకి వస్తున్నాయి. హాలీవుడ్ లో కూడా కాస్టింగ్ కౌచ్ పై పెను వివాదాలు చెలరేగాయి. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో నటి శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పై గత కొన్ని రోజులుగా ఇంటర్వ్యూలతో దుమ్మురేపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురి ఫోటోలు..ఛాటింగ్ తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. దీంతో కొంత మంది నటీమణులు, జూనియర్ ఆర్టిస్టులు సైతం ఇండస్ట్రీ భాగోతాలు బయటపెడుతున్నారు.పవన్ కళ్యాన్ సరసన ‘అత్తారింటికి దారేది’ సినిమాలో నటించిన కన్నడ బ్యూటీ ప్రణిత ఓ ప్రముఖ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది….
తెరపైన అందానికే ప్రాతినిధ్యం ఇచ్చే హీరోయిన్ పాత్రతో పాటు.. నిజంగా తెర వెనుక ఏ నిర్ణయాల్లోనూ ఆమెను భాగస్వామ్యం కానివ్వరని ఆవేదన చెందారు. సినిమా తీసే ముందు చెప్పే కథకు తీసే కథకు పొంతన ఉండదని, అడిగినా.. ‘ఇష్టం ఉంటే చేయి లేకపోతే లేదు’ అన్నట్లుగా దురుసుగా ప్రవర్తిస్తారని చెప్పింది.
ఈ సందర్భంగా తనకు ఎదుదైన ఓ అనుభవనాన్ని వివరించింది ప్రణీత…. మన దేశంలో సంప్రదాయ సినిమాల్లో నటించే వారికంటే పోర్న్ స్టార్స్ కే విలువ ఉందని అన్నారు. ఇక్కడ సంప్రదాయ సినిమాలకు ఒక కథ చెప్పి సంతకం చేయించుకుంటారు. ఆతర్వాత వారి ఇష్టం వచ్చిన సీన్లు తీస్తారు. సెట్లో ఉన్న అందరికంటే హీనంగా హీరోయిన్లనే చూస్తారు.
మరీ దౌర్భాగ్యం ఏంటంటే.. ఓ చిత్రంలో డాన్స్ విషయంలో అభ్యంతరం చెప్పితే కోరియోగ్రాఫర్కూడా ఆగ్రహం వ్యక్తం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఎవరైనా హీరోయిన్లు ఇలాంటి విషయాల్లో గట్టిగా మాట్లాడితే…ఆ హీరోయిన్ కి పొగరు అంటూ రూమర్లు సృష్టిస్తారని వాపోయింది. హీరోయిన్ అంటే … ఐటెం సాంగ్లు, ఏడ్చినా, నవ్వినా, బాధపడ్డా ఏవిధంగానైనా అందంగా కనిపించే వస్తువుగానే చూస్తున్నారని ఆవేదన చెందారు.