సంతానం, అంచల్ సింగ్ హీరో హీరోయిన్లుగా శ్రీ తెన్నాండాళ్ ఫిలింస్ బ్యానర్‌పై తమిళ్ రూపొందిన `దిల్లుడు దుడ్డు` చిత్రాన్ని `దమ్ముంటే సొమ్మేరా` టైటిల్‌తో తెలుగులో అనువాదం చేశారు. శ్రీ కృష్ణా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నటరాజ్ సినిమాను విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ చివరి వారంలో సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేశారు. ఇటివల సెన్సార్ కార్యక్రమాలను పుర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా నిర్మాత నటరాజ్ మాట్లాడుతూ: నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా ఇటివల విడుదల చేసిన మా `దమ్ముంటే సొమ్మేరా` ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. సామాజిక మాధ్యామాలలో ట్రైలర్ కు వస్తున్న రెస్పాన్స్ చూసి మాకు చాలా ఆనందంగా వుంది.సంతానం మంచి నటుడు. ఆయనకు తెలుగు లో కూడా మంచి గుర్తింపు ఉంది.యస్ యస్ ధమన్ సంగీతం మరియు బ్యాగ్రౌండ్ స్కొర్ సినిమాకి హైలైట్. సినిమా లొని ప్రతి ఫ్రేం కూడా ఎంతో అందంగా తీర్చి దిద్దాడు సినిమాటోగ్రాఫర్ దీపక్ కుమార్ పత్తి. పైగా తమిళంలో పెద్ద నిర్మాణ సంస్థ చేసిన ఈ సినిమా ను శ్రీ కృష్ణా ప్రొడక్షన్స్ ద్వారా మేము రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది.ఇటివలే సెన్సార్ కార్యక్రమాలు పుర్తి అయ్యాయి.యు/ఏ సర్టిఫికెట్ పొందింది.తమిళ్లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో కూడా మంచి హిట్ అవుతుందనే నమ్మకం వుంది అని అన్నారు.
శ్రీ కృష్ణా ప్రొడక్షన్స్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ నరసింహారెడ్డి మాట్లాడుతూ “ఏప్రిల్ చివరి వారంలో `దమ్ముంటే సొమ్మేరా` సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం. తప్పకుండా సినిమా తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుంది“ అన్నారు.