నందు, సౌమ్య వేణుగోపాల్, పూజా రామచంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం `ఇంతలో ఎన్నెన్ని వింతలో`. వరప్రసాద్ వరికూటి దర్శకుడు. శ్రీకాంత్ రెడ్డి, రామ్మోహన్ రావు ఇప్పిలి నిర్మాతలు. ఈ చిత్రం ఈ నెల 6న గ్రాండ్గా విడుదలవుతున్న సందర్భంగా మీడియాకోసం ప్రత్యేకంగా ప్రసాద్ ల్యాబ్స్ లో బుధవారం చిత్రాన్ని ప్రదర్శించారు.
ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు చిత్రాన్ని తిలకించిన అనంతరం మాట్లాడుతూ…“టైటిల్ విభిన్నంగా ఉండటంలో సినిమా కాసేపు చూసి వెళ్దామని అనుకున్నాను. కానీ సినిమా ప్రారంభం దగ్గర నుంచి చివరి వరకు అనేక మలుపులతో, చక్కటి ప్రేమకథతో ఆసక్తికరంగా ఉండటంతో సినిమా మొత్తం చూశాను. దర్శకుడికిది తొలి చిత్రమైనప్పటికీ ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా సినిమాను తీర్చిదిద్దిన తీరు అద్భుతం. నందు, పూజా రామచంద్రన్, సౌమ్యవేణుగోపాల్ చక్కటి నటనను ప్రదర్శించారు. ఇందులో ప్రేమ, స్నేహం, ఫ్యామిలీ ఎమోషన్స్ ను ఆకట్టుకునే విధంగా దర్శకుడు తీర్చిదిద్దారు. ముఖ్యంగా పూజారామచంద్రన్ పాత్ర సినిమాకు హైలెట్ గా అనిపించింది. సంగీతం, కెమెరా పనితనం, ఎడిటింగ్ బాగా కుదిరాయి. కొత్త నిర్మాతలైనప్పటికీ అభిరుచితో సినిమాను నిర్మించారు. టీమ్ అందరికీ నా శుభాకాంక్షలు“ అన్నారు. ఇంకా పలువురు సినీ జర్నలిస్ట్ లు సమావేశంలో పాల్గొని చిత్ర యూనిట్ ను అభినందించారు