విజయ్ ధరన్ హీరోగా గీతికా రతన్ , అను హీరోయిన్స్ గా వంశీధర్ క్రియేషన్స్ పతాకంపై ఎం. స్.శ్రీ చంద్ దర్శకత్వంలో టి.గణపతిరెడ్డి,బి.నాగేశ్వర్ రావు నిర్మించిన వెబ్ సిరీస్ చిత్రం ‘డిసైర్ ‘. మార్చ్ 17న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ కార్యక్రం ఘనంగా జరిగింది .ఫైనాన్స్ మినిష్టర్ ఈటెల రాజేందర్ ముఖ్య అతిధిగా విచ్చేసి డిసైర్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు. ఈ కార్యక్రంలో హీరో విజయ్ ధరన్,హీరోయిన్స్ గీతికా,అను,దర్శకుడు ఎం. స్.శ్రీ చంద్,నటులు ధర్మారెడ్డి,సుబ్బారావు,బేబీ తుల్య జ్యోతి,కెమెరామెన్ భరద్వాజ్ దాసరి,సంగీత దర్శకుడు ఎం.వి,కె, మల్లిక్, కథా రచయిత యోగేష్ ఇ.పండిట్, నిర్మాతలు టి.గణపతి రెడ్డి, బి. నాగేశ్వర్ రావు, తదితరులు పాల్గొన్నారు.
ఫైనాన్స్ మినిష్టర్ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ “- టైటిల్ చాల గమ్మత్ గా వుంది. ట్రైలర్ చూస్తుంటే చాల ఇంట్రెస్ట్ గా వుంది.హార్రర్ మూవీస్ చాల థ్రిల్లింగ్ గా ఉంటాయి.ఇ డిసైర్ వెబ్ సిరీస్ సక్సెస్ అయి ఇలాంటివి మరిన్ని చెయ్యాలి.మల్లిక్ చేసిన -రికార్డింగ్ ఎక్సలెంట్ గా వుంది. నిర్మాతలు,దర్శకుడు శ్రీ చంద్ కి నా శుభాకాంక్షలు.అన్నారు.
హీరో విజయ్ ధరన్ మాట్లాడుతూ “- డైరెక్టర్ శ్రీ చంద్ గారు నా మీద నమ్మకం తో ఈ డిసైర్ చిత్రం లో నటించే అవకాశం ఇచ్చారు.కాన్సెప్ట్ బేస్డ్ వున్నా , హార్రర్,థ్రిల్లర్, మూవీ. మా నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు.తప్పకుండా ఇది మంచి సక్సెస్ అవుతుంది.అన్నారు.
దర్శకుడు ఎం.ఎస్.శ్రీ చంద్ మాట్లాడుతూ “- సస్పెన్స్ , హార్రర్ తో డిసైర్ వెబ్ సిరీస్ మూవీని రూపొందించాం.మా యూనిట్ అందరికీ కొండంత ధైర్యాన్ని ఇచ్చి ఈ వెబ్ సిరీస్ ని అద్భుతంగా నిర్మించిన మా నిర్మాత గణపతి రెడ్డి గారికి నా థాంక్స్.అలాగే మల్లిక్ తన మ్యూజిక్ తో, రీరికార్డింగ్ తో,సినిమాకి ప్రాణం పోసాడు. కెమెరామెన్ భరద్వాజ్ ఈచ్ అండ్ ఎవ్విరి ప్రేమ్ బ్యూటిఫుల్ గా చిత్రీకరించాడు.అమెజాన్ కానీ,యూట్యూబ్ ఛానెల్ తో టయ్యప్ అయి ఈ డిసైర్ ని రిలీస్ చేస్తాం అన్నారు.తప్పకుండా ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులకు నచ్చుతుంది అన్నారు.
నిర్మాత టి.గణపతి రెడ్డి మాట్లాడుతూ “- శ్రీ చంద్ ఈ డిసైర్ కాన్సెప్ట్ చెప్పగానే చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను. టీమ్ అంతా చాల కస్టపడి వర్క్ చేసారు. అలాగే కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్,ఇలా ప్రతి వక్కరు ఎంతో సపోర్ట్ చేసారు.అందరికీ నా థాంక్స్ అన్నారు.
హీరోయిన్స్ గీతికా , అను, మాట్లాడుతూ ”- ఈ మూవీ లో నటించే ఛాన్స్ ఇచ్చిన మా డైరెక్టర్ శ్రీ చంద్ గారికి , మా నిర్మాత , గణపతిరెడ్డి గారికి మా థాంక్స్ అన్నారు.
బేబీ తుల్య జ్యోతి మాట్లాడుతూ ‘- ఈ మూవీ లో మెయిన్ క్యారెక్టర్ లో నటించాను. అందరి క్యారెక్టర్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది.ఆడియన్సు ఎంజాయ్ చేసే విధంగా ఈ మూవీ ఉంటుంది. అన్నారు.
సంగీత దర్శకుడు ఎం.వి.కె.మల్లిక్ మాట్లాడుతూ “- టి . వి. సీరియల్స్ కి మ్యూజిక్ చేసే నాకు డైరెక్టర్ శ్రీ చంద్ గారు మ్యూజిక్ డైరెక్టర్ గా ఫస్ట్ అవకాశం ఇచ్చారు.ఆయనకి నా థాంక్స్.ఈ వెబ్ సిరీస్ కి మ్యూజిక్ చేయడం ఒక ఛాలెంజ్ గా తీసుకొని చేశాను.అన్నారు.
కెమెరామెన్ భరద్వాజ్ దాసరి మాట్లాడుతూ ‘”- నేను తీసిన కొన్ని షార్ట్స్ ఫిలిమ్స్ చూసి నా మీద నమ్మకం తో కెమెరామెన్ గా ఛాన్స్ ఇచ్చారు శ్రీ చంద్ గారు. ప్రతి ఒక్కరికి నచ్చేలా ఈ డిసైర్ ఉంటుంది.అన్నారు.