జూన్ 15న సుధీర్‌బాబు, అదితీరావు హైదరీ `స‌మ్మోహ‌నం`

అనూహ్య‌మైన క‌థాంశంతో ఆద్యంతం వినోదాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న కొత్త త‌రం ప్రేమ క‌థా చిత్రం `స‌మ్మోహ‌నం` జూన్ 15న విడుద‌ల కానుంది. సుధీర్‌బాబు హీరోగా మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో  శ్రీదేవి మూవీస్ ప‌తాకంపై శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు.  బాలీవుడ్ భామ అదితీరావు హైదరీ ఇందులో నాయిక‌గా న‌టిస్తున్నారు.  శ్రీదేవి మూవీస్ ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 10గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. 
 
నిర్మాత శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ మాట్లాడుతూ “ఫైన‌ల్ షెడ్యూల్‌ని ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 3 వ‌ర‌కు హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, ముంబైలో తెర‌కెక్కిస్తాం. దాంతో షూటింగ్ పూర్త‌వుతుంది. ఏప్రిల్‌, మేలో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు చేస్తాం. జూన్ 15న చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. సంగీతానికి మంచి  ప్రాధాన్య‌త ఉన్న చిత్ర‌మిది. అత్యుత్త‌మ సాంకేతిక విలువ‌లు ,నిర్మాణ విలువలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి “ అని చెప్పారు.
 
ద‌ర్శ‌కుడు మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి మాట్లాడుతూ “కొత్త ఎత్తుగడ , కొత్త పోకడ ఉన్న ఈ నవతరం కథ లో రొమాన్స్ ,హాస్యం స‌మ్మిళిత‌మై ఉంటుంది  . పి.జి.విందా ఫొటోగ్ర‌ఫీ , వివేక్ సాగ‌ర్ సంగీతం , రవీందర్ కళా దర్శకత్వం ఈ సినిమాలో స్పెషల్ హైలైట్స్ .  ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా తెర‌కెక్కిస్తున్నాం. మంచి క‌థ‌, క‌థ‌నానికి  చ‌క్క‌టి నిర్మాణ విలువ‌లు తోడ‌య్యాయి. టైటిల్‌కి త‌గ్గ‌ట్టుగానే సినిమా మొత్తం అంద‌మైన  ఫీల్ క్యారీ అయి స‌మ్మోహ‌నంగా అనిపిస్తుంది “ అని చెప్పారు. 
 
సుధీర్‌బాబు, అదితిరావు హైద‌రి, న‌రేశ్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, పవిత్రా లోకేష్ ,హర్షిణి , నందు,  కాదంబ‌రి కిర‌ణ్‌, హ‌రితేజ‌, రాహుల్ రామ‌కృష్ణ‌, కేదార్ శంక‌ర్‌, శిశిర్‌శ‌ర్మ త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాకు ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్స్:  పి. ర‌షీద్ అహ్మ‌ద్ ఖాన్‌, కె. రామాంజ‌నేయులు, కో డైర‌క్ట‌ర్‌:  కోట సురేశ్ కుమార్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: య‌స్ . ర‌వీంద‌ర్‌, ఎడిట‌ర్‌:  మార్తాండ్‌.కె.వెంక‌టేశ్‌;  డైర‌క్ట‌ర్ ఆఫ్ పొటోగ్ర‌ఫీ:  పి.జి.విందా,  సంగీతం:  వివేక్ సాగ‌ర్‌, నిర్మాత‌:  శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్‌,  ర‌చ‌న‌- ద‌ర్శ‌క‌త్వం:  మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి.