ప్రభాస్ ప్రతి సినిమాకు ఓ కొత్త లుక్‌తో అభిమానులను మెప్పించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు.పాత్రకు తగ్గట్టు తనను తాను మార్చుకోవడమన్నది అంత తేలిగ్గా అయ్యే పనికాదు. కానీ ‘బాహుబలి’ చిత్రం కోసం కొండనైనా ఢీకొట్టగలిగే వీరుడిలాగా కనిపించేందుకు కండలు బాగా పెంచి కనిపించాడు. ఇప్పుడు ‘సాహో’ కోసం స్లిమ్ అయి స్టయిలిష్ లుక్‌తో అదరగొట్టేస్తున్నాడు.
“ఎప్పుడూ ఒకేలా కనిపించడం ఓ నటుడికి సాధ్యపడదు… మార్పు అనేది తప్పనిసరి” అని అంటాడు ప్రభాస్. “శరీరాకృతి మార్చుకోవడంకన్నా దాని తర్వాత ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కోవడమే పెద్ద సవాల్’ అన్నది అతని మాట. “నేనెప్పుడూ ఒకే తరహా పాత్రలు చేయడాన్ని ఇష్టపడను. సినిమాలో నేను చేయాల్సిన పాత్ర నన్ను అంతగా ఆకట్టుకోకపోతే అసలు దానికి ఓకే చెప్పను. ‘ఈ పాత్ర కోసం ఎంత కష్టమైనా పడాలి’ అనిపించేలా ఉండాలి. అలాంటి స్క్రిప్టు దొరకాలని కోరుకుంటాను. కొత్తగా ప్రయత్నించాలి అనుకున్నప్పుడు మారక తప్పదు”అని చెప్పాడు ప్రభాస్.
ప్రస్తుతం అతను నటిస్తున్న ‘సాహో’ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతోంది. ఇందులో బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ హీరోయిన్గా నటిస్తుండగా… నీల్‌నితిన్ ముఖేష్ విలన్‌గా చేస్తున్నాడు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ కెరీర్లో ఇదే అతిపెద్ద భారీ బడ్జెట్ చిత్రం. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నఈ సినిమా ‘రన్ రాజా రన్’ ఫేం సుజిత్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
హిందీ ప్రేమ్ కీ కహానీ లో ….
బాలీవుడ్లో 500 కోట్ల క్లబ్లో చేరిన సినిమాల లిస్ట్ గురించి మాట్లాడితే.. అందులో రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన సినిమా ‘బాహుబలి’ మొదటి వరసలో ఉంటుంది. అయితే.. ఇప్పుడు ప్రభాస్ బాలీవుడ్లో హీరోగా చేయబోతున్నారు.
‘‘నేను హిందీ సినిమాలు చూస్తాను. హైదరాబాద్‌లో 60 శాతం జనం హిందీలో మాట్లాడగలరు. బాలీవుడ్ నుంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి.హిందీ సినిమాలో నటించడానికి మూడేళ్ల క్రితం ప్రేమ కథ విన్నాను. నచ్చింది. ‘సాహో’ తర్వాత నటించాలనుకుంటున్నాను. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ‘బాహుబలి’ టీమ్‌కి హెల్ప్ చేశారు. ఆయన ఇచ్చిన పార్టీలో బాలీవుడ్ యాక్టర్స్‌ను కలిశాను’’ అని పేర్కొన్నారు ప్రభాస్. మహేంద్ర బాహుబలి, అమరేంద్ర బాహుబలిగా శక్తిమంతమైన పాత్రల్లో కనిపించిన ప్రభాస్ నెక్స్ట్ హిందీలో ప్రేమ్ కీ కహానీలో కనిపించడం కొత్తగా ఉంటుందనే చెప్పాలి.