రామ్ ఎంటర్టైనర్స్ పతాకంపై తరుణ్, ఓవియా హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘ఇది నా లవ్‌స్టోరీ’. రమేష్ గోపీ దర్శకులు. ఎస్.వి.ప్రకాష్ నిర్మాత. ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదలవుతుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. ఈ సందర్భంగా..
కె.ఎల్.నారాయణ మాట్లాడుతూ – విజువల్స్ చాలా బావున్నాయి. తరుణ్ లుక్ బావుంది. తనతో మా బ్యానర్లో ‘నిన్నే ఇష్టపడ్డాను’ సినిమా చేశాం. తనకి సినిమాలంటే ఎంత ప్యాషనో నాకు తెలుసు. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది” అన్నారు.
నిర్మాత ఎస్.వి.ప్రకాష్ మాట్లాడుతూ – ”మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన సినీ పెద్దలకు, డిస్ట్రిబ్యూటర్స్‌కి థాంక్స్” అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ శ్రీనాథ్ విజయ్ మాట్లాడుతూ – ”సినిమా ఆరు పాటలున్నాయి. నాకు మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్” అన్నారు.
మంచు మనోజ్ మాట్లాడుతూ – ”ఈ సినిమా టీజర్‌ను ముందు నుండి ఫాలో అవుతున్నాను. సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్ని బాగా నచ్చాయి. చాలా హ్యాపీగా ఉంది. తరుణ్ గ్యాప్ తీసుకుని వస్తున్నాడు. తనకు మంచి సక్సెస్ రావాలి. టీమ్‌కి ఆల్ ది బెస్ట్” అన్నారు.
చిత్ర దర్శకుడు రమేష్ మాట్లాడుతూ – ”మంచు మనోజ్గారు అడగ్గానే ఈ సినిమాలో చిన్న అతిథి పాత్రలో కనపడ్డారు. ఎంతో ఎంకరేజ్ చేసిన ఆయనకు థాంక్స్. సినిమాను చక్కగా తీశాం. చక్కగా ప్రమోట్ చేశాం. ఫిబ్రవరి 14న సినిమా విడుదలవుతుంది. ఏ ఒక్కరినీ డిసప్పాయింట్ చేయని సినిమా ఇది” అన్నారు.
చిత్ర దర్శకుడు గోపి మాట్లాడుతూ – ”ఔట్ అండ్ ఔట్ లవ్‌స్టోరీ. సినిమా చూసిన ప్రేక్షకులు ఎక్కడో ఒకచోట కనెక్ట్ అవుతారని కాన్ఫిడెంట్‌గా చెప్పగలను. ఈ సినిమా చేయడానికి కారణం నిర్మాత ఎస్.వి.ప్రకాష్‌గారు. ఆయనకి ఎప్పటికీ రుణ పడి ఉంటాను. కో ప్రొడ్యూసర్ గణేష్గారికి థాంక్స్. సినిమా అందరికీ నచ్చుతుంది. ప్రేమికుల రోజు సందర్భంగా సినిమా ఫిబ్రవరి 14న విడుదలవుతుంది. అన్నయ్య రమేష్, నేను 15 సంవత్సరాలు కష్టపడ్డాం. ఆ కష్టమే ఈ సినిమా. శ్రీనాథ్ విజయ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. సినిమాటోగ్రాఫర్ క్రిస్టోఫర్గారు అద్భుతమైన విజువల్ ఇచ్చారు. తరుణ్‌గారు ప్రాణం పెట్టి ఈ సినిమా చేశారు. తను మమ్మల్ని నమ్మి సినిమా చేశారు. వన్ మ్యాన్ ఆర్మీలా నిలబడ్డారు. వెరైటీ స్క్రీన్‌ప్లేతో సినిమా ఉంటుంది. ఓవియాగారు కూడా తరుణ్గారితో పోటీ పడి నటించారు. నాకు సహకారం అందించిన అందరికీ థాంక్స్” అన్నారు.
డి.సురేష్‌బాబు మాట్లాడుతూ – ”చిత్ర హీరో తరుణ్, దర్శకులు రమేష్, గోపి, నిర్మాత ఎస్.వి.ప్రకాష్ సహా ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్” అన్నారు.
హీరో నిఖిల్ మాట్లాడుతూ – ”తరుణ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండస్ట్రీ. అందరూ తరుణ్‌ని బాగా ఇష్టపడుతారు. ఈ సినిమా ఆల్రెడీ కన్నడలో పెద్ద హిట్. ఈ మధ్య విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. ఫిబ్రవరి 14న విడుదలవుతున్న ఈ సినిమా కచ్చితంగా తెలుగులో కూడా పెద్ద సక్సెస్ అవుతుంది” అన్నారు.
హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ – ”తరుణ్ నాకు మంచి మిత్రుడు.. ఇష్టమైన వ్యక్తి. దర్శక నిర్మాతలతో సినిమా స్టార్టింగ్ నుండి మంచి పరిచయం ఉంది. సినిమా మంచి హిట్ సాధించి తరుణ్‌కి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను” అన్నారు.
హీరో తరుణ్ మాట్లాడుతూ – ”పెద్ద గ్యాప్ తర్వాత ‘ఇది నా లవ్‌స్టోరీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. చాలా క్లీన్ లవ్‌స్టోరీ. సినిమా అందరూ కనెక్ట్ అవుతారు. అబ్బాయిలు వాళ్లని నాలో.. అమ్మాయిలు హీరోయిన్లో వాళ్లని చూసుకుంటారు. దర్శకులు రమేష్, గోపిలు సినిమాను చక్కగా డైరెక్ట్ చేశారు. కథనం, స్క్రీన్‌ప్లే కూడా చక్కగా రాశారు. వారి తొలిసారి డైరెక్ట్ చేసిన సినిమా ఇది. క్రిస్టోఫర్ జోసెఫ్ అద్భుతమైన విజువల్స్, శ్రీనాథ్ విజయ్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు. వీరికి కూడా తెలుగులో ఇది తొలి సినిమా. ఓవియా కూడా చక్కగా నటించింది. తనకి కూడా ఇది తెలుగులో తొలి సినిమా. గోగినేని బాలకృష్ణగారు ఫిబ్రవరి 14న సినిమాని విడుదల చేస్తున్నారు. మా సినిమాకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్” అన్నారు.