ఒంటి చేత్తో సినిమాను నడిపించే సత్తా ఉండడంతో నయనతార నంబర్ వన్ గా నిలబడ్డారు. సౌత్ ఇండియాలో అందాల నయనతార అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ ల లిస్ట్ లోనూ టాప్‌ప్లేస్‌లో కొనసాగుతోంది. కొత్త హీరోయిన్లతో పోటీపడుతూ.. ‘ఇండియా టుడే’ పోల్‌లో మొదటిస్థానంలో నిలిచింది. కోలీవుడ్‌లో చేసిన ఈ సర్వేలో 21శాతం ఓట్లతో మొదటిస్థానాన్ని దక్కించుకుంది. ‘నానుమ్ రౌడీ దాన్’ (‘నేను రౌడీనే’) సినిమాలో నయన్ నటనకు ముగ్ధులైన ప్రేక్షకులు ఆమెను మొదటిస్థానంలో నిలబెట్టారు. చిరంజీవి నటిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ లోనూ నయన్ హీరోయిన్గా నటిస్తోంది.
సౌత్ ఇండస్ట్రీలో అనుష్క ‘అరుంధతి’ లాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలతో క్రేజ్ తీసుకొచ్చింది.’బాహుబలి’తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అనుష్క ఈ పోల్‌లో 9 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. త్వరలో ‘భాగమతి’ సినిమాతో అభిమానులను అలరించబోతోంది . 8 శాతం ఓట్లతో సమంత, ఓవియా, కీర్తి సురేష్ లు ముగ్గురు మూడో స్థానంలో నిలిచారు. గత ఏడాది పెళ్లి కారణంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సామ్, కాస్త వెనకబడింది. ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్ లలో వరుస సినిమాలకు కమిట్ అవుతూ జోరు చూపిస్తోంది. ఈ నెల 26న రానున్న ‘అభిమన్యుడు’ సినిమాలో రతిదేవిగా అలరించేందుకు రెడీ అవుతోంది సమంత. ఓవియాకు హిట్ సినిమాలు లేకున్నా.. ఈ పోల్‌లో మూడో స్థానంలో నిలిచింది. ‘బిగ్‌బాస్’ షోతో వచ్చిన పాపులార్టీతో ఈ అమ్మడు కెరీర్ లాగించేస్తుంది. ప్రస్తుతం ఈ భామ రాఘవ లారెన్స్ తెరకెక్కిస్తున్న ‘ముని 4′(కాంచన3)లో నటిస్తోంది.
అందం, అమాయకత్వం రెండూ ఉన్న ముద్దుగుమ్మ కీర్తిసురేశ్ మూడో స్థానం సాధించింది. ఎక్స్‌పోజింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వకుండా కేవలం నటనకు స్కోప్ ఉన్న పాత్రల్లోనే నటిస్తోంది కీర్తి. విజయ్, సూర్య, పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరోల సరసన నటించిన ఈమె, ప్రస్తుతం ‘మహానటి’ పేరుతో తెరకెక్కుతున్న సావిత్రి బయోపిక్ లో హీరోయిన్గా నటిస్తోంది.అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తూ సీనియర్ హీరోయిన్ త్రిష 6శాతం ఓట్లను సాధించి తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకుంది.అందాల హన్సిక 7శాతం ఓట్లతో తర్వాతి స్థానంలో దక్కించుకుంది. కోలీవుడ్ లో మంచి విజయాలు సాధిస్తున్న ఈమె… ఈ మధ్యే మాలీవుడ్‌లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కేరళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ హీరోగా నటించిన ‘విలన్’ సినిమాలో నటించింది.