‘మెగా పవర్‌స్టార్’ రామ్‌చరణ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో కొత్త చిత్రం రెగ్యులర్ షూటింగ్ శుక్రవారం హైదరాబాద్‌లో స్టార్ట్ అయ్యింది. శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి.ఎంటర్టైన్మెంట్స్ ఎల్.ఎల్.పి బ్యానర్‌పై దానయ్య డి.వి.వి భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా …
చిత్ర నిర్మాత దానయ్య డి.వి.వి మాట్లాడుతూ – ”మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి కలయికలో సినిమా అనగానే అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఓ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సినిమా ఎలా ఉంటుందోనని ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. హీరోలను ఎక్స్ట్రార్డినరీగా తెరపై ఆవిష్కరించే దర్శకుడు బోయపాటి శ్రీను… అద్భుతమైన కథతో రామ్‌చరణ్‌ను సరికొత్త రీతిలో చూపించనున్నారు. మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో సినిమాను రూపొందించబోతున్నాం. బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వాని ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. తమిళ నటుడు ప్రశాంత్, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.. రిషి పంజాబి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈరోజు నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ నెలాఖరు వరకు మొదటి షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతుంది. ఫిబ్రవరిలో సెకండ్ షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నాం. మెగాభిమానులు, ప్రేక్షకులు అంచనాలకు ధీటుగా సినిమాను రూపొందిస్తాం” అన్నారు.
రామ్‌చరణ్, కైరా అద్వాని, ప్రశాంత్, వివేక్ ఒబెరాయ్, స్నేహ, హిమజ, ప్రవీణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: ఎం.రత్నం, స్టిల్స్: జీవన్, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమెరామెన్: రిషి పంజాబీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి.వై.ప్రవీణ్ కుమార్, కో-ప్రొడ్యూసర్: డి. కళ్యాణ్, నిర్మాత : దానయ్య డి.వి.వి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బోయపాటి శ్రీను.