‘పరాజయం వస్తేనే విజయాల విలువ, అందులోని ఆనందం విలువ తెలుస్తుంది’ అని అంటోంది సమంత. తన కెరీర్లో హిట్స్ కంటే ఫ్లాప్స్ ఎక్కువగా ఉన్నాయి. అయినా ఎప్పుడూ నిరాశ పడలేదట. చేసిన పని ఎందుకు వైఫల్యం చెందిందో సమీక్షించుకుని అలా మరోసారి చేయకుండా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటుందట. నేను అపయాలను నుంచి చాలా నేర్చుకున్నాను… అని అంటున్న సమంత జయాపజయాల గురించి చెబుతూ… ‘దర్శక, నిర్మాతలు నాపై నమ్మకంతోనే సినిమాల్లో తీసుకునేవారు. సక్సెస్, ఫెయిల్యూర్స్ గురించి నేను పెద్దగా పట్టించుకోను. కానీ నా పాత్రకు వంద శాతం న్యాయం చేశానా? లేదా? అన్నదే నాకు ముఖ్యం. సక్సెస్ వచ్చినప్పుడు మనచుట్టూ వాతావరణం ఎంతో సందడిగా ఉంటుంది. అదే ఫెయిల్యూర్ వస్తే అంతా నిస్తేజంగా ఉంటుంది. ఫ్లాప్‌ల సమయంలో నాకెదురైన అనుభవాలకు మాత్రం నేనెక్కువ ప్రాధాన్యత ఇస్తాను. చుట్టూ ఉండే వారు సక్సెస్ వచ్చినప్పుడు ఎలా ఉంటారు? పరాజయం వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేస్తారనేది తెలుసుకున్నాను. అప్పట్నుంచి ఒక్కో మెట్టు ఎలా ఎక్కాలో నేర్చుకున్నా. ఒక్కో సంఘటన, దాని అనుభవం, ఇతరుల ప్రవర్తన చూసి నన్ను నేను మార్చుకుంటూ వస్తున్నాను. మున్ముందు కూడా ఇదే ఫాలో అవుతాను’ అని తెలిపింది. విజయాలను ఎలా ఆస్వాదించానో, వైఫల్యాలను కూడా ఆలానే చూశానని పేర్కొంది.
మై మామ్ ఈజ్ ట్రూలీ అమేజింగ్
చిన్నప్పుడు జరిగిన సంఘటనలు పెద్దయ్యాక గుర్తు చేసుకుంటుంటే భలే గమ్మత్తుగా అనిపిస్తుంటాయి. సమంత కూడా తన బాల్యానికి సంబంధించిన చిన్ని చిన్ని జ్ఞాపకాలను అప్పుడప్పుడూ నెమరు వేసుకుంటుంటారు. కొన్ని విషయాలను బయటకు కూడా చెబుతుంటారు. ‘‘ప్రతి బుధవారం, శనివారం, ఆదివారం మా అమ్మగారు నన్ను చర్చ్‌కు లాక్కొని వెళ్లేవారు. చిన్నప్పుడు చాలా చిరాకుగా అనిపిస్తుండేది. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే తన ప్రార్థనలే నన్ను కాపాడుతున్నాయి అనిపిస్తుంది’’ అని సమంత పేర్కొన్నారు.
అంతే.. చిన్నప్పుడు పెద్దవాళ్లు చెప్పినవన్నీ చిరాకుగానే అనిపిస్తాయి.పెద్దయ్యాక ఆ మాటలకు విలువ తెలుస్తుంది. ఇది కాకుండా సమంత మరో స్వీట్ మెమరీని కూడా పంచుకున్నారు. ‘‘ఒకసారి పరీక్షలప్పుడు నేను విపరీతమైన అనారోగ్యానికి గురయ్యాను. మా అమ్మగారు నాతో పాటు స్కూల్‌కి వచ్చి నా పక్కనే కూర్చుని పరీక్ష రాయించారు. నిజానికి నాకు రాసే ఓపిక కూడా లేదు. కానీ, పక్కనే అమ్మ ఉందనే బలం నాతో రాయించింది. మై మామ్ ఈజ్ ట్రూలీ అమేజింగ్’’ అని చెప్పుకొచ్చారు సమంత. సమంత ప్రస్తుతం తెలుగులో ‘రంగస్థలం’, ‘మహానటి’, తమిళంలో ‘ఇరుంబు థిరై’ (‘అభిమాన్యుడు’),
‘సూపర్ డీలక్స్’తోపాటు మరో సినిమాలోనూ నటిస్తూ బిజీగా ఉంది.