‘సఖి’, ‘చెలి’ లాంటి సినిమాలతో రొమాంటిక్ హిట్స్ కొట్టిన మాధవన్ తర్వాత కామెడీ ఎంటర్టైనర్స్, ‘యువ’, ‘సాలా ఖడూస్’ లాంటి సినిమాల రఫ్ క్యారెక్టర్స్ పోషించినా మాధవన్‌ని రొమాంటిక్ హీరోగానే ఫిక్స్ చేశారు సినీజనాలు. ప్రేక్షకులు కూడా మాడీని లవర్ బాయ్ గానే చూస్తున్నారు.ఇమేజ్ సంపాదించడం కంటే ఆ ఇమేజ్ నుంచి బయటపడ్డానికి చాలా కష్టపడాలి. రొమాంటిక్ హీరోగా ప్రేక్షకులను అలరించిన హీరో మాధవన్ ఇప్పుడు కంప్లీట్ యాక్షన్ హీరోగా మారుతున్నాడు. లవ్ స్టోరీస్‌ని పక్కనపెట్టి అడ్వంచరస్ మూవీ చెయ్యబోతున్నాడు. జంగల్ బ్యాక్ డ్రాప్లో అడ్వెంచరస్ మూవీ చేస్తున్నాడు.
‘సాలా ఖడూస్'(గురూ)లో బాక్సర్‌గా, ‘విక్రమ్ వేద’లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలు పోషించి, బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన మాధవన్ ఇప్పుడు ఎ.సర్గుణమ్ దర్శకత్వంలో యాక్షన్ మూవీ చెయ్యబోతున్నాడు. ఎక్కువగా అటవీప్రాంతంలోనే షూటింగ్ జరుపుకునే ఈ సినిమాలో మాధవన్ రిస్కీ స్టంట్స్ చేస్తాడట. ఆ అండ్వెంచర్స్, ఫైట్స్ సౌత్ సినిమాకే చాలా కొత్తగా అనిపిస్తాయట. ‘హ్యారీ పోటర్ అండ్ ది డెత్లీ హాలోస్ పార్ట్-2’, ‘డ్రాకులా అన్ టోల్డ్’ లాంటి సినిమాలకు స్టంట్ డైరెక్టర్‌గా పనిచేసిన గ్రెడ్ బర్రిడ్జ్ ఈ సినిమాలో మాధవన్‌తో హాలీవుడ్ స్టైల్లో ఫైట్స్ చేయించబోతున్నాడట.థాయ్ లాండ్, మంగోలియాలో ఎక్కువగా షూటింగ్ జరుపుకోబోతోన్న ఈసినిమా జూన్‌లో స్టార్ట్ కాబోతోంది.
ఈసినిమా ఫుల్ యాక్షన్ మోడ్‌లో రూపొందుతోన్నా, ఫ్యామిలీ ఆడియన్స్‌ని ముఖ్యంగా చిన్న పిల్లలను బాగా అలరిస్తుందని చెబుతున్నారు దర్శకనిర్మాతలు. అడవిలో మాధవన్ చేసే సాహసాలకు యూత్ ఫుల్లుగా ఇంప్రెస్ అవుతారని అంటున్నారు. మరి రొమాంటిక్ హీరోగా తెలుగు,తమిళ్లో మంచి ఫాలోయింగ్ ఉన్న మాధవన్, యాక్షన్ హీరోగానూ రాణిస్తాడేమో చూడాలి…
కోటి రూపాయలకు ఓకే అన్నాడట !
టాలీవుడ్లో విలన్ రెమ్యునరేషన్ కోటికి లోపే ఉంటుంది. ఇక్కడ చాలా మంది టాలెంటెడ్ విలన్లు ఉన్నారు. వీరిని కాదని కోలీవుడ్ నుంచి ఓ విలన్ దిగుమతి అవుతున్నాడు. అతనెవరో కాదు మాధవన్. మాధవన్ తెలుగులో పెద్దగా సినిమాలు చేయకపోయినా, అభిమానులు చాలా మందే ఉన్నారు. అందుకే అతగాడిని విలన్ ని చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చిందట! వెంటనే అది వర్కవుట్ కూడా అయిపోయింది. కోటి రూపాయలకు మాధవన్ ఓకే అన్నాడట! అన్నీ బాగానే ఉన్నాయి. చాక్లెట్ బాయ్‌లాగా కనిపించే మాధవన్ విలనిజాన్ని ఎలా చేస్తాడో … ఆసక్తికరం గానే ఉంది ఈ వార్త …