డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ బి. దర్శకత్వంలో ‘ప్రేమలో పావని కళ్యాణ్’, ‘చంటిగాడు’, ‘గుండమ్మగారి మనవడు’, ‘లవ్లీ’, ‘వైశాఖం’ వంటి సూపర్‌హిట్ చిత్రాలను నిర్మించి అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు ప్రముఖ నిర్మాత బి.ఎ.రాజు. జనవరి 7 నిర్మాత బి.ఎ.రాజు పుట్టినరోజు సందర్భంగా తమ ఆర్.జె. సినిమాస్ బేనర్‌పై మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ను నిర్మించనున్నట్టు ప్రకటించారు.
ఈ సందర్భంగా నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ – ”మా బేనర్లో నిర్మించిన మొదటి సినిమా ‘ప్రేమలో పావని కళ్యాణ్’. నిర్మాతగా ఎంటర్ అయి 15 సంవత్సరాలు పూర్తయింది. మా బేనర్లో వచ్చిన ‘ప్రేమలో పావని కళ్యాణ్’, ‘చంటిగాడు’, ‘గుండమ్మగారి మనవడు’, ‘లవ్లీ’, ‘వైశాఖం’ చిత్రాలను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇప్పుడు మా ఆర్.జె. సినిమాస్ బేనర్లో జయ దర్శకత్వంలో మరో చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్ని నిర్మించబోతున్నాం. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. జూన్‌లో ఈ సినిమాని స్టార్ చేస్తాం. అలాగే మా సూపర్‌హిట్ మ్యాగజైన్ 24వ సంవత్సరంలోకి సక్సెస్‌ఫుల్‌గా అడుగుపెట్టింది. మా వెబ్సైట్ ‘ఇండస్ట్రీ హిట్ డాట్ కామ్’ మంచి రేటింగ్‌తో నాలుగో సంవత్సరంలోకి ఎంటర్ అయింది” అన్నారు.