సినిమాల పరంగా శృతిహాసన్‌కు ఈ ఏడాది ఏమాత్రం కలిసిరాలేదు. ఈ ఏడాది తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఒక్కొక్క సినిమా చేసింది ఈ బ్యూటీ. ఏ భాషలోనూ సక్సెస్‌ను సాధించలేకపోయింది. కానీ వ్యక్తిగతంగా మాత్రం ఆమె చాలా సంతోషంగా ఉంది. ఎంతో కాలంగా ప్రేమాయణాన్ని కొనసాగిస్తున్న ఈ భామ చివరికి తన బాయ్‌ఫ్రెండ్‌ను ఇటీవల తన కుటుంబానికి దగ్గర చేసింది. ఈ ఏడాది తెలుగులో ‘కాటమరాయుడు’ సినిమా చేసింది శృతిహాసన్. ఆ సినిమా నిరాశపరిచింది. అంతకంటే ముందు తమిళంలో సూర్యతో చేసిన ‘సింగం-3’ కూడా ఫెయిల్ అయింది. ఈ రెండు సినిమాల తర్వాత బాలీవుడ్లో చేసిన మరో మూవీ కూడా ఫ్లాప్ అవడంతో ఈ ఏడాది ఫెయిల్యూర్ హీరోయిన్ల లిస్ట్‌లోకి చేరిపోయింది శృతి.
మరోవైపు వ్యక్తిగతంగా మాత్రం ఆమె మంచి పురోగతి సాధించింది. తన బాయ్‌ఫ్రెండ్ కోర్సల్ను తల్లి సారిక, తండ్రి కమల్‌హాసన్‌కు పరిచయం చేయగలిగింది. ప్రస్తుతం వీళ్లిద్దరూ తమ రిలేషన్‌షిప్‌ను బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఇక 2018లో ఆమె ఏం చేయబోతోందనేది ఇప్పుడు అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. అయితే 31 ఏళ్ల శృతిహాసన్… మైఖేల్ కోర్సల్ను పెళ్లి చేసుకుంటుందని కొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం మరోసారి సినిమాలతో బిజీ అవుతుందని చెబుతున్నారు. కాగా వచ్చే ఏడాదికి సంబంధించి శృతిహాసన్ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. కమల్‌హాసన్ మధ్యలో వదిలేసిన ‘శభాష్ నాయుడు ’ తప్ప. మరి వచ్చే ఏడాది శృతిహాసన్ సినీ కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి.
త్వరలో ఈ జంట పెళ్లి పీటల మీద….
శ్రుతి, మైఖేల్ పెళ్లికి కమల్‌హాసన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందనే సంకేతం అందింది.అటు తల్లి సారికకు కూడా సమ్మతమే అని, త్వరలో ఈ జంట పెళ్లి పీటల మీద కూర్చుంటుందని చాలామంది ఓ అభిప్రాయానికి వచ్చేశారు. అయితే ‘‘ఇప్పట్లో పెళ్లి లేదు’’ అని శ్రుతి సన్నిహిత వర్గాలు అంటున్నాయి. మరి.. శ్రుతి, మైఖేల్ పెళ్లి నిజమేనా? అంటే.. శ్రుతి తన పర్సనల్ మేటర్స్ని ఎవరి దగ్గరా డిస్కస్ చేయదని… అయితే ప్రస్తుతానికి ఆమె దృష్టంతా సినిమాల పైనే ఉందని అంటున్నారు. మరి… శ్రుతి మనసులో ఏముందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. అయితే లండన్ నుంచి మైఖేల్ ఇక్కడికి రావడం, అడపా దడపా శ్రుతి అక్కడికి వెళ్లడం, తమిళ సంప్రదాయాన్ని ఆచరించి, మైఖేల్ పంచె కట్టుకోవడం.. ఇవన్నీ చూస్తుంటే ఈ ఇద్దరూ పెళ్లి చేసుకునే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి.