“పెళ్లిచూపులు” , “అర్జున్ రెడ్డి” చిత్రాలతో సంచలన విజయాలు అందుకున్న విజయ్ దేవరకొండ మంచి ఊపు మీదున్నాడు. ముఖ్యంగా అర్జున్ రెడ్డి సంచలన విజయం సాధించడంతో విజయ్ దేవరకొండ కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. దీంతో అవకాశాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. పెద్ద ఎత్తున అవకాశాలు వస్తుండటంతో విజయ్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు.
ఇటీవల బాలీవుడ్ లో దిగ్గజ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ విజయ్ దేవరకొండ తో సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చారు, అయితే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు. అది కూడా వరుసగా ….. పైగా అదే సమయంలో వేరే సినిమాలు చేయొద్దని కండీషన్ కూడా ఉంది. దాంతో యశ్ రాజ్ ఫిలిమ్స్ వాళ్ళ ఆఫర్ ని తిరస్కరించాడు విజయ్ దేవరకొండ . విజయ్ యశ్ రాజ్ ఫిలిమ్స్ చిత్రాలను రిజెక్ట్ చేయడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఎందుకంటే యశ్ రాజ్ చిత్రాలను చేయడం వల్ల ఈ హీరో ఇమేజ్ దేశ వ్యాప్తం అవుతుంది. కానీ అదే సమయంలో తెలుగులో చేసే అవకాశం ఉండదు. అందుకే ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసాడట విజయ్ దేవరకొండ
ముద్దులు , హగ్గులు ఏమి లేవు !