“మనదేశంలో అద్భుతమైన కథలు రాసే రచయితలు ఎందరో ఉన్నారు. అయితే వారికి సినిమాల్లో అవకాశాలు లభించడం కష్టంగా ఉంది. ప్రతిభ కలిగిన రచయితలను వెలికి తీసి, వారికి మెరుగైన అవకాశాలు కల్పించడం కోసమే ‘సినీస్ఠాన్ ఇండియా’ కథల పోటీని నిర్వహిస్తోంది. ఈ అద్భుతమైన కార్యక్రమంలో నేనూ ఓ భాగం అయినందుకు ఆనందంగా ఉంది” అని బాలీవుడ్ నటుడు ఆమీర్‌ఖాన్ అన్నారు. సినిమా కథల కోసం, రచయితల కోసం ‘సినీస్ఠాన్ ఇండియా’ నిర్వహిస్తున్న కథల పోటీకి ఆయన న్యాయనిర్ణతగా వ్యవహరిస్తున్నారు. దర్శకుడు రాజు హీరానీ, స్క్రీన్ ప్లే రచయితలు జుహీ చతుర్వేది, అంజూయ్ రాజాబాలీ మిగిలిన న్యాయనిర్ణేతలు. భారతదేశంలోనే ఇది అతి పెద్ద రచనల పోటీ అనీ, అత్యుత్తమ కథకు రూ. 25 లక్షలు బహుమతిగా ఇస్తామనీ, ఈ పోటీలో మొత్తం నగదు బహుమతులు రూ. 50 లక్షల వరకూ ఉంటాయని ‘సినీస్థాన్ డిజిటల్’ ఛైర్మన్ రోహిత్ ఖత్తార్ చెప్పారు. దక్షిణాదిన ఈ నెల ఒకటి నుంచి జనవరి 15 వరకూ ఎంట్రీలు స్వీకరిస్తామని ఆయన తెలిపారు.