సినిమా రంగంలో పైరసీ, లీకేజ్ లతోపాటు కాపీ అనే పదం కూడా ఈ మధ్య కాలంలో తెగ వినిపిస్తోంది. సినిమా పోస్టర్ రిలీజ్ చేసిన, లేదంటే ఏదైన కాన్సెప్ట్ కి సంబంధించి ‘మోషన్ పోస్టర్’ విడుదల చేసిన వెంటనే ‘ఇది హాలీవుడ్ మూవీకి కాపీ’ అంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ పెడుతుంటారు. నిజానికి వాళ్ళు పెడుతున్న కామెంట్స్ లో చాలా వరకూ వాస్తవం ఉంటోంది . మన వాళ్ళు మంచి copy cats అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు కాపీ కారణంగా ‘అఖిల్’ సినిమా టీజర్ యూ ట్యూబ్ నుండే ఎగిరిపోయిందట.విషయం ఏమిటంటే….
ఫిన్ లాండ్ కి చెందిన ‘ఎపిక్ నార్త్’ అనే కంపెనీ టీజర్స్ కోసం ప్రత్యేకంగా ఓ మ్యూజిక్ తయారు చేస్తుందట. ఎంతో క్వాలిటీగా ఉండే ఆ మ్యూజిక్ ని మనం కూడా కొంత మొత్తం చెల్లించి వాడుకోవచ్చు. కాని ‘ఎక్సోసూట్’ అనే మ్యూజిక్ ని హలో చిత్ర సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఏమీ చెల్లించకుండానే టీజర్ కి వాడేశాడని సమాచారం. దీంతో కాపీరైట్ క్లైమ్ కారణంగా హలో టీజర్ ని యూట్యూబ్ నుండి తీసేశారు. అన్నపూర్ణ స్డూడియో బేనర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా విక్రమ్ కుమార్ తెరకెక్కించిన ‘హలో’ సినిమాకి ఇలాంటి సమస్య ఎదురు కావడంతో అందరూ షాక్ తిన్నారు