మాస్ హీరో విశాల్ ఇటీవల విడుదలైన ‘డిటెక్టివ్’తో మరో సూపర్‌హిట్‌ని అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై పి.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న ‘అభిమన్యుడు’. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ ఓ డిఫరెంట్ క్యారెక్టర్‌తో అలరిస్తారు. మాస్ హీరో విశాల్ సరసన సమంత నటిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు విశాల్. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌కి చాలా మంచి స్పందన వచ్చింది. కాగా, ఆదివారం ఈ చిత్రం మోషన్ పోస్టర్ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా మాస్ హీరో విశాల్ మాట్లాడుతూ ”అభిమన్యుడు’ ఫస్ట్‌లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు మోషన్ పోస్టర్ని విడుదల చేశాం. నా కెరీర్లో ఇప్పటి వరకు చేసిన సినిమాలకు పూర్తి భిన్నమైన సినిమా ఇది. కంటెంట్ పరంగా, టెక్నికల్‌గా, బడ్జెట్ విషయంలో అన్నింటిలోనూ హై రేంజ్లో వుంటుంది. హీరోగా, నిర్మాతగా నేనెంతో ఇష్టపడి చేస్తున్న సినిమా ‘అభిమన్యుడు’. దర్శకుడు మిత్రన్ ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తీస్తున్నారు. అర్జున్‌గారు చేస్తున్న క్యారెక్టర్ చాలా విభిన్నంగా వుంటుంది. బడ్జెట్ పరంగా ఎలాంటి లిమిట్స్ లేకుండా హై క్వాలిటీతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాము. నా కెరీర్లో ఈ సినిమా వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అవుతుంది. ఈ చిత్రాన్ని జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నాం. డిసెంబర్ 27న చాలా గ్రాండ్‌గా ఆడియోను రిలీజ్ చేస్తాం” అన్నారు.
మాస్ హీరో విశాల్, సమంత, యాక్షన్ కింగ్ అర్జున్‌తోపాటు భారీ తారాగణం ఈ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: జార్జి సి. విలియమ్స్, ఎడిటింగ్: రూబెన్, ఫైట్స్: దిలీప్ సుబ్బరాయన్, ఆర్ట్: ఉమేష్ జె.కుమార్, మాటలు: రాజేష్ ఎ.మూర్తి, నిర్మాత: విశాల్, దర్శకత్వం: పి.ఎస్.మిత్రన్.