అరవిందస్వామితో కలిసి నటించడం మంచి అనుభవం . ఈ చిత్రం ద్వారా నాకు లభించిన మంచి స్నేహితుడు ఆయన.. చాలా విషయాలు ఆయనతో పంచుకుంటున్నానని అమలాపాల్ చెప్పారు. అరవిందస్వామికి జంటగా నటించిన ‘భాస్కర్ ఓరు రాస్కెల్’ లో తాను కారైక్కుడి యువతిగా నటించానని అమలాపాల్ చెప్పింది.ముక్కపుడక, లంగా వోణి అంటూ పాత గెటప్ కొత్తగా ఉంటుందని తెలిపింది. ఇందులో ఒక పిల్లకు తల్లిగా నటించానని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ చూసి ఆనందించే విధంగా దర్శకుడు సిద్ధిక్ తీశారని చెప్పారు.
తన జీవితంలో ఇది మంచి టైమ్‌గా భావిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. ఇటీవల స్త్రీ ప్రధాన ఇతివృత్తంతో తెరకెక్కుతున్న చిత్రాలకు ప్రేక్షకాదరణ లభించడం మంచి పరిణామంగా పేర్కొంది. నయనతార నటించిన ‘అరమ్’ చిత్రం అందరి ప్రశంసలను పొందుతోందనీ, అలాంటి సామాజిక అంశాలతో కూడిన ‘అదో అంద పరవై’ అనే చిత్రంలో తానూ నటిస్తున్నాని ఈ మళయాళీ బ్యూటీ తెలిపారు. తన అందాన్ని కాపాడుకోవడానికి యోగా, ఎక్సర్సైజ్లు నిత్యం చేస్తున్నారని, తన సంతోషానికి ప్రధాన కారణం యోగానేనని అమలాపాల్ చెప్పారు
నా అబ్జర్వేషన్‌ని ఇందులో చూపించారు !
‘దొంగోడొచ్చాడు’లో నా పాత్ర చాలా స్పెషల్. పేరు అగళ్. అగళ్ అంటే దీపం అని అర్థం. ఓ స్మాల్ టౌన్ నుంచి వచ్చిన అమ్మాయి పాత్ర అది. ఆర్టిస్టిక్‌గా ఉండే పాత్ర. ‘ఇల్లు బావుండాలి. వేసుకునే డ్రస్ కూడా అందంగా ఉండాలి’ అని అనుకునే మిడిల్ క్లాస్ కేరక్టర్. తనకి సంబంధించిన ప్రతి విషయాన్నీ ఫేస్‌బుక్‌లోనూ, ఇతర సోషల్ ప్లాట్ఫార్మ్స్లోనూ అప్డేట్ చేసుకునే రకం. అమితంగా సోషల్ మీడియా వాడకం వల్ల ఆమెకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? అనేది సినిమా.
ఈ సొసైటీలో మనం ఏమాత్రం ఓపెన్‌గా ఉన్నా కష్టమే. పొలిటికల్ వరల్డ్‌లో ఉన్నాం. సోషల్ మీడియా, డిజిటల్ వరల్డ్ అనేవి మన జీవితాల్లో భాగమైపోయాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ వీటి మీద బేస్ అయిపోతున్నారు. సో వాటి గురించి మంచీ చెడులను చెప్పే సినిమా. ఇందులో ఈ పాత్ర గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా విషయాలు కామన్ మేన్‌కి రీచ్ అవుతాయి. ఓ నటిగా నాకు సంతృప్తినిచ్చే చిత్రమవుతుంది. ఒక రకంగా సొసైటీ మీద నాకున్న అబ్జర్వేషన్‌ని ఇందులో చూపించారు. ఇలాంటి సినిమాలు చేయడం నా బాధ్యత.