ఆంధ్రుడు, యజ్ఞం, లక్ష్యం, శౌర్యం, లౌక్యం వంటి సూపర్‌డూపర్ చిత్రాలతో మెప్పించిన టాలీవుడ్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా కొత్త చిత్రం ఈరోజు హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. హీరో గోపీచంద్ నటిస్తున్న 25వ చిత్రమిది. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ను ‘బెంగాల్ టైగర్’ వంటి సూపర్ డూపర్ చిత్రాన్ని నిర్మించిన శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మించనున్నారు. బలుపు, పవర్, జై లవకుశ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు స్క్రీన్‌ప్లే అందించిన కె.,చక్రవర్తి ఈ చిత్రానికి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ముహుర్తపు సన్నివేశానికి వి.వి.వినాయక్ క్లాప్‌కొట్టగా, తెలంగాణ ఎఫ్ డీ సీ చైర్మన్ పి.రామ్మోహన్ రావు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దిల్‌రాజు తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా…
నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ – “మా సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో రూపొందుతోన్న 7వ చిత్రమిది. మా బ్యానర్లో గత చిత్రం `బెంగాల్ టైగర్` ప్రారంభమైన ప్రాంతంలోనే..ఈ సినిమా స్టార్ట్ కావడం ఆనందంగా ఉంది. `బెంగాల్ టైగర్` సినిమా హిట్ అయినట్టుగానే ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్ అవుతుంది. గోపీసుందర్ సంగీతం, ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కె.చక్రవర్తి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. డిసెంబర్ 16 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది“ అన్నారు.
దర్శకుడు కె.చక్రవర్తి(చక్రి) మాట్లాడుతూ – “ఈ సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం కలిగించిన మా హీరో గోపీచంద్‌గారికి, నిర్మాత రాధామోహన్‌గారికి థాంక్స్. అలాగే గోపీచంద్‌గారి 25వ చిత్రం ఇదే కావడం సంతోషంగా ఉండటటమే కాకుండా, ఓ బాధ్యతగా ఫీలవుతున్నాను“ అన్నారు.
మెహరీన్ మాట్లాడుతూ – “నేను హీరోయిన్గా నటిస్తోన్న 5వ చిత్రం, గోపీచంద్‌గారికి 25వ చిత్రం కావడం ఆనందంగా ఉంది. ఇంత మంచి సినిమాలో పార్ట్ కావడం ఆనందంగా ఉంది“ అన్నారు.
హీరో గోపీచంద్ మాట్లాడుతూ – “చక్రి చెప్పిన కథ ఎంతో బాగా నచ్చింది. డిసెంబర్ 16 నుండి సినిమా చిత్రీకరణ ప్రారంభం అవుతుంది. మా నాన్నగారి సినిమాలు ఎంత పవర్ ఫుల్ మెసేజ్‌లతో ఉండేవో మనకు తెలిసిందే. అలాంటి మంచి మెసేజ్‌తో పాటు, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో సినిమా తెరకెక్కనుంది. రాధామోహన్‌గారి బ్యానర్లో సినిమా చేయడం ఆనందంగా ఉంది“ అన్నారు.
గోపీచంద్, మెహరీన్, పృథ్వీ, జయప్రకాష్ రెడ్డి తదితరులు నటించనున్న ఈ చిత్రానికి ఆర్ట్ః ఎ.ఎస్.ప్రకాష్, డైలాగ్స్ః రమేష్ రెడ్డి, స్క్రీన్‌ప్లేః కె.చక్రవర్తి, బాబీ(కె.ఎస్.రవీంద్ర), కో డైరెక్టర్ః బెల్లంకొండ సత్యంబాబు, మ్యూజిక్ః గోపీసుందర్, సినిమాటోగ్రఫీః ప్రసాద్ మూరెళ్ల, నిర్మాతః కె.కె.రాధామోహన్, స్టోరీ, డైరెక్షన్ః కె.చక్రవర్తి(చక్రి).