ప్రముఖ నిర్మాణసంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి పతాకంపై మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, రాశిఖన్నా జంటగా యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఫిబ్రవరి 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా ..నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ – “వరుణ్ తేజ్ హీరోగా మా బ్యానర్లో సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉంది. దర్శకుడు వెంకీ అట్లూరి లవ్ ఎంటర్టైనర్గా సినిమా తెరకెక్కిస్తున్నారు. సినిమా చాలా చక్కగా వచ్చింది. ఇటీవల సినిమా షెడ్యూల్ లండన్‌లో జరిగింది. నలభై రోజుల పాటు ఏకధాటిగా జరిగిన ఈ షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణలో 70 శాతం టాకీ పూర్తయ్యింది. డిసెంబర్ నెలనాటికి షూటింగ్‌ను పూర్తి చేస్తాం. థమన్ ఎక్స్ట్రార్డినరీ మ్యూజిక్, జార్జ్ సి.విలియమర్స్ సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద ఎసెట్‌గా నిలుస్తాయి. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఫిబ్రవరి 9న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం“ అన్నారు.
Varun Tej’s next with BVSN Prasad to release on February 9
Tollywood’s leading production house Sri Venkateswara Cine Chitra has zeroed in on February 9 as the ideal date to release their upcoming film directed by Venky Atluri and starring Varun Tej and Raashi Khanna.
Speaking on the occasion, producer BVSN Prasad, who is bankrolling the film, said, “We are very happy with the progress of the film so far. Venky has come up with a beautiful love entertainer and everyone is sure going to love it. It is also such a pleasure to work with a talented young lad like Varun Tej for the first time. We had a long schedule of nearly 40 days in London where around 70 per cent of the film was wrapped up. We will finish shooting in December. Thaman is scoring music for the film while George C. Williams is on the camera. Both of them will be a huge asset to the film. We plan to release the film on February 9 after all the post-production is done.””