నిర్మాతల శ్రేయస్సును కోరుకునే హీరో మహేష్. మహేష్ బాబుతో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఎంతో ఇష్టపడతారు. కారణం ఆయన సూపర్‌స్టార్ కావడం మాత్రమే కాదు.తనతో సినిమా చేయడం వల్ల నిర్మాతల నష్టపోతే… తన రెమ్యూనరేషన్లో కొంత భాగం వెనక్కి ఇచ్చేసే హీరో ఆయన. ‘బ్రహ్మోత్సవం, స్పైడర్’ మూవీలతో నష్టపోయిన నిర్మాతలకు తను తీసుకున్న రెమ్యూనరేషన్లో కొంత భాగం వెనక్కి ఇచ్చేశాడని టాలీవుడ్లో వార్తలు తెలిసిందే. అలాగే రెమ్యూనరేషనే కాకుండా మరో సినిమాకి అవకాశం కూడా ఇస్తాడని టాక్ ఉంది.మంచి కథ కుదిరితే అతి త్వరలో 14 రీల్స్ బ్యానర్లో మహేష్ సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
‘దూకుడు’ సినిమాతో టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థగా 14 రీల్స్ బ్యానర్‌కి పేరు వచ్చింది. మహేష్‌బాబుతో చేసిన ఈ సినిమా హిట్‌తో ఈ బ్యానర్ పేరు అప్పట్లో మారుమోగింది. అయితే ఆ తర్వాత మహేష్ హీరోగా ఈ బ్యానర్లో మరో రెండు సినిమాలు వచ్చాయి. ‘1 నేనొక్కడినే, ఆగడు’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూశాయి. ఈ రెండు సినిమాలు ఇచ్చిన రిజల్ట్‌తో కొంత కాలంగా ఈ బ్యానర్ పేరే వినబడలేదు.అయితే తాజాగా మహేష్ ఈ బ్యానర్‌కి మరో అవకాశం ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ‘మంచి కథతో వస్తే సినిమా చేద్దాం’ అని మహేష్ మాట ఇవ్వడంతో 14 రీల్స్ నిర్మాతలు మంచి కథ కోసం ప్రయత్నాలు చేస్తున్నారంట.