జస్ట్ ఎంటర్టైన్మెంట్ క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ వంగల ప్రభాకర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం `బృందావనమది అందరిది. యుంగ్ సక్సెస్ ఫుల్ రైటర్ శ్రీధర్ సీపాన దర్శకుడు గా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే , గతంలో లౌక్యం, పూల రంగడు, అహనా పెళ్ళంటా, డిక్టేటర్ ,నమో వేంకటేశ, దూకుడు, పోటుగాడు,భీమవరం బుల్లోడు, నిప్పు, మిస్టర్ వంటి చిత్రాలకు రచయితగా పని చేసిన శ్రీధర్ సిపాన ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవ్వడం విశేషం. తాజాగా ‘బృందావమది అందరిది’ చిత్ర పూజాకార్యక్రమం హైదరాబాద్ లోని సినిమా ఆఫీస్ లో జరిగింది , పూజలో బాగంగా గణపతి హోమం చేసారు, ఈ కార్యక్రమం లో హీరో సునీల్, దర్శకుడు యన్ .శంకర్ 30ఇయర్స్ పృద్వి ,సత్యం రాజేష్, డైరెక్టర్ శ్రీధర్ సీపాన, ప్రొడ్యూసర్ శ్రీనివాస్ వంగల, కెమెరామెన్ ఎం .ఎస్ .తేజ మరియు ఈ చిత్ర యూనిట్ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా దర్శకుడు శ్రీధర్ శ్రీపాన మాట్లాడుతూ.. నన్నునమ్మి నాతో “బృందావనమది అందరిది” సినిమా చేస్తున్న నిర్మాత శ్రీనివాస్ వంగల గారికి కృతజ్ఞతలు, ఆయన నమ్మకమే నాలో భయాన్ని, బాధ్యతని పెంచింది. బృదావనమది అందరిదీ` చిత్రం ద్వారా నాతో పాటు కొత్త నటీనటులను తెలుగు తెరకు పరిచయం చేయడం ఆనందంగా ఉంది. అక్టోబర్10 నుండి హైదరాబాద్ మా సినిమా ఆఫిస్ లో జరిగే అడిషన్ లో హీరో హీరోయిన్స్ నటీనటులను సెలక్ట్ చేసి త్వరలో సెట్స్ పైకి తీసుకెళ్తాము అన్నారు. ఆసక్తి గల నటీనటులు ఈ (9550344449) వాట్స్ అప్ నెంబర్ కు ఫోటోలు మరియు పూర్తి వివరాలు పంపించగలరని తెలిపారు.
ఈ చిత్రానికి సంగీతం:మణిశర్మ, సినిమాటోగ్రఫీ: ఎం.ఎస్.తేజ, ఎడిటర్:ప్రవీణ్ పూడి, నిర్మాతలు : శ్రీనివాస్ వంగల, ప్రభాకర్ రెడ్డి, దర్శకత్వం: శ్రీధర్ సిపాన