తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ అంటే ఒక దేవతగా కొలుస్తూ ఎంతో మంది ప్రజలచే పూజింపబడుతుంది. ఇది తరతరాలుగా వస్తున్న పండగ. కానీ మద్యలో స్తబ్దత ఏర్పడ్డ తర్వాత మళ్ళీ ఈ బతుకమ్మ సంబరాలను కల్వకుంట్ల కవిత ఎమ్.పి. గారు తెలుగు ప్రజలు ప్రపంచ వ్యాప్తంగ సంబరాలు జరుపుకోవడానికి స్పూర్తిని ఇచ్చారు. అదే స్పూర్తితో నేను ప్రతాని రామక్రిష్ణ గౌడ్ ఆర్.కె.ఫిల్మ్స్ బ్యానర్ పైన ‘బతుకమ్మ పాట’ రిలీజ్ చేసి, రచన స్మిత్ ని హీరోయిన్ గా పెట్టి … ఇంక కొంత మంది మహిళలతో సాంగ్ షూటింగ్ చేయడం జరిగింది. రచన స్మిత్ హీరోయిన్ అద్భుతమైన డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇచ్చి… బతుకమ్మ ఆడుతూ కోలాటలు ఆడుతూ, దాండియ ఆడుతూ చాలా బాగా నటిస్తూ డ్యాన్స్ చేయడం జరిగింది. ఇందులో నేను కూడా దాండియ ఆడుతూ డప్పు ను వాయించడం జరిగింది. ఈ పాటకు మ్యూజిక్ మెలోడి శ్రీనివాస్ , దర్శక పర్యవేక్షణ రమణ , ఎడిటర్ రాజు, డి.ఒ.పి శ్రీనివాస్ రెడ్డి , గోపి చేసారు. ఈ పాట మంచి సక్సెస్ కావాలని, ప్రజాదరణ పొందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను … అని అన్నారు ఈ బతుకమ్మ సాంగ్ నిర్మాత ప్రతాని రామక్రిష్ణ గౌడ్ .