యన్టీఆర్ కు ఒక పక్క ‘జై లవ కుశ’ విజయం, మరో పక్క ‘బిగ్ బాస్’ ఘన విజయం రెండూ.. రెండు విధాలు గానూ సంతోషాన్ని కలిగించాయి. అయితే ఈ రెండింటి కోసం అతడు పడ్డ కష్టం సామాన్యమైంది కాదని సన్నిహితులు చెబుతున్నారు. అందుకే ఈ స్టార్ హీరో ఏకంగా మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నారట. యన్టీఆర్ ఓ మూడు నెలలు ఎక్కడికైనా లాంగ్ టూర్ కు వెళ్ళాలని భావిస్తున్నారట. ఎన్టీయార్ త్రివిక్రమ్ తో చేసే కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి మార్చ్ వరకూ టైమ్ ఉండటంతో ఇది కలిసొచ్చిందని సినీజనం చెప్పుకుంటున్నారు.
యన్టీఆర్ తలుచుకుంటే ఈ మూడు నెలల్లో ఒక సినిమాను కంప్లీట్ చేసేయగలరు. కానీ యన్టీఆర్ అందుకు భిన్నంగా విశ్రాంతి వైపే మొగ్గు చూపారని తెలుస్తోంది. జనవరి వరకూ కొత్త సినిమాలు , ప్రాజెక్టుల జోలికి పోకూడదని నిర్ణయించుకున్నారట. గత మూడు నెలలుగా రెస్ట్ లెస్ గా వర్క్ చేయడం వల్ల యన్టీఆర్ ఇప్పుడీ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. విశేషం ఏమంటే… ఈ విశ్రాంతి దినాలను కుటుంబ సభ్యులతో కలిసి యూరప్ లో గడపబోతున్నారట.ఈ లాగ్ వెకేషన్ టూర్ ను ఎన్టీయార్ యూరప్ దేశాలను ఎంచుకున్నారని అంటున్నారు. తాను ఎక్కడి వెళ్ళబోతున్నారో ఎన్టీయార్ బయటకు చెప్పడం లేదని అంటున్నారు. అయితే పనిలో పనిగా ఈ టూర్ లోనే యన్టీఆర్ కాస్తంత లావు తగ్గే ప్రయత్నం కూడా చేస్తారట. అందుకే అక్కడ పూర్తి స్థాయి వర్కౌట్స్ కూ ప్లాన్ చేసారని తెలుస్తోంది.