‘యాంగ్రీ యంగ్ మాన్’ రాజశేఖర్ హీరోగా, చందమామ కథలు, గుంటుర్ టాకీస్ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ “పి.ఎస్.వి గరుడ వేగ `126.18 ఎం`. జ్యో స్టార్ ఎంటర్ప్రైజెస్ బ్యానర్‌పై కోటేశ్వర్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది.
ఈ సందర్భం గా ‘ఆంధ్ర ప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్’ చైర్మన్ అంబికా కృష్ణ మాట్లాడుతూ – “చాలా మంది సినిమాల్లో హీరోలుగా చెలామణి అవుతుంటారు. కానీ విలన్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆర్టిస్ట్ రాజశేఖర్ హీరోగా ఎదిగారు. ‘శేషు’ వంటి విలక్షణమైన సినిమా చేయాలన్నా, పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో నటించాలన్నా రాజశేఖర్గారికే చెల్లింది. ‘గరుడవేగ’ సినిమాతో ఆయన మళ్లీ పూర్వ వైభవాన్ని తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను“ అన్నారు.
డా.రాజశేఖర్ మాట్లాడుతూ – “ఈ సినిమా టీజర్‌ను నా పిల్లలతో వారి స్నేహితుడు ఒకరు చూసి… ‘ఈ సినిమా టీజర్ మాట్లాడుతుంది. మీ నాన్నగారేం మాట్లాడనవసరం లేదు’అని అన్నాడు. నేను చాలా ఫెయిల్యూర్స్‌ను ఫేస్ చేసిన తర్వాత విలన్‌గా, క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా చేయమని అడిగారు. నేను కూడా సరేనని అనుకున్నాను. ఆ సమయంలో నేను 30-40 కథలను విన్నాను.ఏ ఒక్కటీ నచ్చలేదు. అలాంటి సమయంలో ప్రవీణ్ సత్తారు ఈ కథతో నా వద్దకు వచ్చారు. నేను పీక్స్‌లో ఉన్నప్పుడు ఇలాంటికథతో సినిమా చేయాలని అనుకున్నాను. భారీ బడ్జెట్‌తో, హలీవుడ్ స్టాండర్డ్స్‌లో సినిమా చేయడానికి నిర్మాతలు ఎవరూ ధైర్యం చేయలేకపోయారు. నేను ఫెయిల్యూర్స్‌లో ఉండగా ప్రవీణ్ నేను చేయాలనుకున్న కథతో వచ్చాడు. మరి ఇతను హ్యాండిల్ చేయగలడా? అని కూడా అనుకున్నాను. ‘నాకు మీరు నటించిన ‘మగాడు’ సినిమా అంటే ఇష్టం. మిమ్మల్ని అంత పవర్‌ఫుల్‌గా చూపిస్తాన’ని అన్న ప్రవీణ్ సత్తారు అద్భుతంగా సినిమాను తెరకెక్కించారు. ‘మేన్ బిహైండ్ ది గరుడ వేగ’ ప్రవీణ్ సత్తారు గారే. ప్రవీణ్‌ను జీవిత ముందుకు నడిపింది. ఇలాంటి భారీ బడ్జెట్ సినిమాను నాపై నమ్మకంతో ఎవరు నిర్మిస్తారని అనుకుంటున్న తరుణంలో మా నాన్నగారి స్నేహితుల ద్వారా పరిచయం అయిన కోటేశ్వరరాజుగారు, ఆయన శ్రీమతి హేమగారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను భారీ స్థాయిలో నిర్మించారు. సినిమాను ముందు ఐదారు కోట్లలోనే పూర్తి చేయాలనుకున్నాం. కానీ, చివరకు పాతిక కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. ఇది మా ఇంటిలో పెళ్లిలాంటి సినిమా. పెళ్లికి అందరినీ పిలిచినట్లు ఈ సినిమాకు అందరినీ పిలిచి చూపిస్తాను“ అన్నారు.
చిత్ర నిర్మాత కోటేశ్వర్ రాజు మాట్లాడుతూ – “కార్పొరేట్ స్టయిల్‌ను సినిమాల్లో ఇంప్లిమెంట్ చేస్తూ చేసిన సినిమా ఇది. నేను చదువుకునే రోజుల్లోనే ‘మగాడు’ సినిమాను మా ఊరి టెంట్లో చూసి హీరోగా రాజశేఖర్‌గారిని ఆరాధించాను. ఇప్పుడు మా జ్యోస్టార్ బేనర్‌పై ‘గరుడవేగ’ సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా నిర్మాణం కోసం ముందు ఐదారు కోట్లు అనుకున్నా.. అవుట్‌పుట్ బాగా వస్తుండటంతో మేకింగ్‌లో కాంప్రమైజ్ కాకూడదని నిర్ణయం తీసుకున్నాను. ఈ ప్రయాణంలో నా స్నేహితులు నాకు అండగా నిలిచారు. అందరికీ థాంక్స్“ అన్నారు.
నిర్మాత కోటేశ్వర్ రాజు శ్రీమతి హేమ మాట్లాడుతూ – “ఇలాంటి సినిమాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి“ అన్నారు.
దర్శకుడు ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ – “సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాం. ఈ జర్నీలో నా టీం అందించిన సపోర్ట్ మరచిపోలేను. లార్జ్ స్కేల్ స్క్రిప్ట్ ఇది. ఇలాంటి సినిమా చేయడానికి రాజశేఖర్ వంటి హీరో అవసరం అనిపించి ఆయన్ను కలిశాను. ‘మగాడు’ వంటి సినిమా చేస్తానని ఆయనతో అన్నాను. ఆయన నాపై నమ్మకంతో సినిమా చేశారు. సినిమా ఇంత బాగా రావడానికి జీవితగారు అందించిన సపోర్ట్ మరచిపోలేను. సినిమా 70 ఎం.ఎం. స్కేల్లో చూస్తున్నట్లు గ్రాండ్ విజువల్స్‌తో భారీగా ఉంటుంది. ఇంత పెద్ద సినిమా కోసం ఏది అడిగితే అది సమకూర్చిన నిర్మాతలకు థాంక్స్“ అన్నారు.
ఈ కార్యక్రమంలో పూజా కుమార్, ఆదిత్, భీమ్స్, శ్రీచరణ్, శ్రీకాంత్ రామిశెట్టి తదితర చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
ఈ చట్రం లో రాజశేఖర్, పూజా కుమార్, ఆదిత్, కిషోర్, నాజర్, ఆదర్శ్, శత్రు, రవిరాజ్‌లు ప్రొఫెషనల్ కిల్లర్స్ పాత్రలో కనపడనున్నారు. శ్రీనివాస్ అవసరాల కామెడి పాత్ర పోషిస్తున్నాడు. అలీ సైకాలజిస్ట్ పాత్రలో, పృథ్వీ నింఫోమానియక్ పేషెంట్‌గా, పోసాని కృష్ణమురళి, షాయాజీ షిండే పొలిటిషియన్స్ పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతంః శ్రీచరణ్ పాకాల, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ః భీమ్స్, సినిమాటోగ్రఫీః అంజి, గికా చెలిడ్జే, బకూర్ చికోబావా, సురేష్ రగుతు, శ్యామ్, ఎడిటింగ్ః ధర్మేంద్ర కాకరాల, ఆర్ట్ః శ్రీకాంత్ రామిశెట్టి, స్టంట్స్ః నూంగ్, డేవిడ్ కుబువా, సతీష్, బాబీ అంగారా, నిర్మాత: కొటేశ్వర్ రాజు, దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు.
Vega’ Teaser unveiled to rousing reception
The teaser of ‘Garuda Vega’ was released in the presence of the film’s main cast and crew members, at Prasad Labs, on Friday.
The teaser of ‘Garuda Vega’ was released in the presence of the film’s main cast and crew members, at Prasad Labs, on Friday.
Jeevitha Rajasekhar, who has traveled with the project right since it her husband got on board, introduced all the film’s team to the media.
Varadarajan, Rajasekhar’s father, said, “They used to say that I look like an ideal DCP. After my son made it as a hero, they started calling me ‘Rajsekhar’s father’. I am proud of him.”
Producer Ambika Krishna said, “In my opinion, Rajasekhar is the only artiste who could become a hero. He is a powerful and talented performer. Be it his body language or facial expressions, he comes across as a 100 percent artiste. Be it as a cop or a chained victim in ‘Seshu’, he is versatile and kills it, whatever may be the role. Like many, he has had his share of highs and lows. He is a good person. I wish that ‘GV’ not only makes money but also brings happiness.”
Producer Raj Kandukuri said, “The title itself is very vibrant. Rajasekhar’s children are like mine. Coming to Jeevitha, she has been very dedicated throughout. Even while making coffee in the kitchen, she would think and talk only about this movie. When we saw films like ‘Ankusham’, we all felt this is how an honest man should be like. I appreciate the producers. ‘Garuda Vega’ is like a Hollywood flick.”
Praveen Sattaru said, “We worked really hard and you can see that in the Teaser. I thank my entire direction department, without whom it would have been impossible to make a movie of this scale. A strong direction team is a must. This is a large-scale script. We are missing larger-than-life movies of the kind we used to see in the pre-2000s era. We are only seeing comedies that are shot in a house or two. We are no longer getting those 70 MM experiences. I wanted to do such a movie with Rajasekhar garu. Although ‘Gorintaku’ was a big hit, I told him that I would like to do something larger-than-life like a ‘Magadu’. And here we are with the final product.”
Rajasekhar said, “Even though I had been wanting to meet the press, I couldn’t do it because of my pre-occupation with the film. I love to talk with the media to heart’s content. I wanted to tell a lot today. Recently, my daughter’s friend watched the Teaser and told her that I shouldn’t say anything as the Teaser speaks for itself. I have had failures in a row. There has also been a lot of gap since my last movie. Some reports have said that I would be playing a villain or a character artiste in some movies. I too thought that, maybe, I should do that because they think I am ageing. I had listened to at least 30-40 subjects. None of them inspired me but for Praveen Sattaru’s script. This is the kind of subject I wanted to do 15 years ago. I would tell my producers that we should do something Hollywoodian. None of them came forward. When Praveen gave me this script, I wondered how it will be executed. My wife and children were equally excited about the story. We had to find a good producer. It’s when my father’s friend, who always wanted to work with me, came to my mind. My father was always telling me to consider the option of working with him. I wouldn’t take it that seriously. But when Jeevitha suggested the name once again, I wanted to go in for Koteswara Raju garu. Initially, we thought that the budget will not be more than Rs. 5-6 Cr. But as the film progressed, so did the costs. Despite it costing something like Rs. 25 Cr, the producer was ready to invest that much. All credit to them.”
The actor further said that neither he nor his wife interferes with the director’s work. “If Praveen is the director, where is the need to interfere? They say that building a home and completing a marriage is very difficult. They should add making a film to the list. This film is like a marriage in our family,” Rajasekhar said.
Pooja Kumar, the film’s heroine, said, “When Praveen narrated the story to me, I found it quite innovative and edgy. I immediately told him I am on board. I am happy to have done a Telugu movie.”
Adith Eeswaran said, “Previously, after completing a movie, I would wonder as to what to do next. For the first time, I am thinking as to what I should do after this film becomes a hit. This is not over-confidence.”
Ravi Varma said, “It was in 2016 that I signed up this film. So, the year will be the most important one for me. I enjoyed working with Praveen every single day.”
Actor Charan said, “I have grown up watching Rajasekhar garu’s movies. I was always approached for negative roles. For this movie, I was approached for a positive role, thanks to Shivani and Shivatmika (Rajasekhar’s daughters). They say Rajasekhar garu is an angry man. He is anything but that.”
Producer Koteswara Raju said, “I and my wife come from a corporate background. And we always seek to implement the best practices from that world. We didn’t spend on this movie without a proper plan in place. Everything was by design. I had watched ‘Magadu’ movie in a tent in my village. Since then, I have liked Rajasekhar. His father is like God to us. We reposed complete faith in the director. Whatever may be the difficulty, he delivers the goods. We gave him whatever he needed.”
Hema, Raju’s wife and the other producer, said, “I have always been a fan of Rajasekhar garu since the days of ‘Ankusham’. Whenever I see an angry face, I am reminded of him. He is a courageous man. We thank the financiers for supporting us throughout. Jeevitha garu is like a motherly figure. The couple is very pure-hearted.”
Music directors Sricharan Pakarla and Bheems expressed their happiness for being part of the film. Anji, the cinematographer, thanked the producers for the opportunity. Art director Srikanth described it as an excellent script. Editor Dharmendra praised the script.